end

హైదరాబాదీలకు గూగుల్ గుడ్‌న్యూస్

మనం ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ముందు ఆలోచిస్తూ ఉంటాము కదా అదే అంటే ట్రాఫిక్ ఎటు వైపు ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వారి కోసం కొత్త ఫీచర్‌ ని గూగుల్ వారు హైదరాబాదీలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మరి ముఖ్యంగా రైడర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ వల్ల మన గమ్య స్థానాన్ని సులభంగా చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్‌ కి కొత్తగా వచ్చిన వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అడ్రెస్ తెలియకపోయిన ఈ ఫీచర్‌ తో చాలా సులభంగా చేరవల్సిన గమ్య స్థానాన్ని చేరుకోవచ్చు. మ్యాప్స్‌ యాప్‌కు స్ట్రీట్ వ్యూ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. ఇది యూజర్లకు చాలా ఉయోగకరంగా ఉండబోతోంది. మొదట బెంగళూరులో ఈ ఫీచర్‌ను లాంచ్ చేయగా హైదరాబాద్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది.

గూగుల్ మ్యాప్స్‌కు అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది. ఎట్టకేలకు స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను ఇండియాకు తీసుకొచ్చింది గూగుల్. బెంగళూరులో ఈ ఫీచర్‌ను నేడు లాంచ్ చేయగా అతిత్వరలోనే హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇంకో 8 నగరాల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ వస్తే ఇంట్లో కూర్చొనే నగరంలోని ఏ ప్రాంతాన్నయినా రియలస్టిక్‌గా చూడవచ్చు. ల్యాండ్‌మార్క్‌లను సులభంగా గుర్తుపట్టవచ్చు. వెళ్లాలనుకున్న గమ్యానికి మరింత సులువుగా చేరుకోవచ్చు. మరిన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి. దీంతో పాటు మరో ఫీచర్లను కూడా మ్యాప్స్ తీసుకొస్తోంది ముఖ్యంగా ట్రాఫిక్ కోసం దీన్ని లాంచ్ చేయనుంది. మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ ముందుగా దేశంలోని ఏఏ నగరాలకు రానుంది. పూర్తి ఉపయోగాలు ఏంటి కొత్తగా రానున్న మరికొన్ని ఫీచర్లేంటో పూర్తి వివరాలు తెల్సుకుందాం.

మన దేశానికి చెందిన మ్యాపింగ్ సొల్యూషన్ కంపెనీ జెనెసిస్ ఇంటర్నేషనల్, ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను మ్యాప్స్‌కు తీసుకొచ్చింది గూగుల్. ప్రయోగాత్మకంగా మొదట బెంగళూరు నగరంలో స్ట్రీవ్యూను (జూలై 27) లాంచ్ చేసింది. అంటే బెంగళూరు వాసులకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది.బెంగళూరు తర్వాత మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి వచ్చేది మన హైదరాబాద్‌కి. ఆ తర్వాత కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, నాసిక్, వడోదరా, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ నగరాలకు కూడా వస్తుంది. ఈ పదింటితో పాటు ఈ ఏడాది చివరికల్లా దేశంలోని 50కు పైగా నగరాల్లో స్ట్రీట్ వ్యూ సదుపాయాన్ని తీసుకురావాలని గూగుల్ నిర్ణయించుకుంది.

స్ట్రీట్ వ్యూ ఎలా వాడాలి

గూగుల్ మ్యాప్స్‌ యాప్‌లోకి వెళ్లి మనం చేరుకోవాల్సిన ఏరియా పేరును టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ కింది భాగంలో స్ట్రీట్ వ్యూ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి. అప్పుడు స్ట్రీట్ వ్యూలో ఆ ప్రాంతం మొత్తం కనిపిస్తుంది. లేకపోతే మ్యాప్‌పై కనిపించే లేయర్స్ సింబల్‌పై ట్యాప్ చేసి కూడా స్ట్రీట్ వ్యూను ఎనేబుల్ చేసుకోవచ్చు.

స్ట్రీట్ వ్యూ ఎలా ఉపయోగపడుతుందంటే..

నగరంలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఆ సమీపంలోని ల్యాండ్‌మార్క్‌లను స్ట్రీట్ వ్యూ ద్వారా స్పష్టంగా చూడవచ్చు. ఆ ప్రాంతం మొత్తం ఈ వ్యూలో రియలస్టిక్‌గా కనిపిస్తుంది. వెళ్లాలనుకున్న గమ్యానికి సులువుగా చేరుకోవచ్చు. మొత్తంగా సెర్చ్ చేసిన ప్రాంతంలో ఏం ఉన్నాయో మన డివైజ్‌లోనే స్పష్టంగా చూడవచ్చు.

Exit mobile version