end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంUS Visa for Indians :అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్!
- Advertisment -

US Visa for Indians :అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్!

- Advertisment -
- Advertisment -

భారతీయుల వీసా (Visa) ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు అమెరికా (America) పలు కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక ఇంటర్వ్యూలను షెడ్యూల్​చేయడంతోపాటు కాన్సులర్ సిబ్బంది సంఖ్యను పెంచడం ఈ చర్యల్లో భాగం. వీసా బ్యాక్​లాగ్‌లను (Visa backlogs) కట్ చేసే క్రమంలో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy in Delhi)తోపాటు ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లోని కాన్సులేట్స్‌లో ‘స్పెషల్​శాటర్​డే ఇంటర్వ్యూ డేస్’ (Special Saturday Interview Days’ at Consulates in Mumbai, Kolkata, Chennai, Hyderabad)ను నిర్వహించనున్నారు!

ఇండియాలోని యూఎస్ మిషన్​(US Mission)చర్యల్లో భాగంగా.. ఈ నెల 21న తొలి ‘స్పెషల్​శాటర్​డే ఇంటర్వ్యూ డేస్​’ (Special Saturday Interview Days’) ను నిర్వహించాము. ఇది ఓ సిరీస్. ముందు ముందు కూడా ఇలాంటివి జరుగుతాయి. మొదటిసారి వీసాకు అప్లై చేస్తున్న వారి వెయిటింగ్ టైమ్​ను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టాము,” అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. రానున్న నెలల్లో.. ఎంపిక చేసిన కొన్ని శనివారాల్లో అడిషనల్​ స్లాట్స్​కు అనుమతులిచ్చి.. ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూఎస్ ఎంబసీ (US Embassy)స్పష్టం చేసింది. కొవిడ్​ సంక్షోభం కారణంగా ఏర్పడిన భారీ వెయిటింగ్ పీరియడ్​ను తగ్గించి, వీసా ప్రాసెసింగ్​ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు వివరించింది. ఇక కాన్సులర్​ సిబ్బంది సంఖ్యను తాత్కాలికంగా పెంచేందుకు 2023 జనవరి నుంచి మార్చ్​ వరకు అనేక మంది అమెరికా అధికారులు.. వాషింగ్టన్​ నుంచి ఇండియాకు రానున్నారు. ఫలితంగా వీసా ప్రాసెసింగ్​కెపాసిటీ (Visa processing capacity) పెరగడంతో పాటు వెయిటింగ్​పీరియడ్​కూడా తగ్గుతుంది.

ఈ క్రమంలో ఇప్పటికే 2,50,000 అడిషనల్ బీ1/ బీ2 అపాయింట్​మెంట్లను విడుదల చేసింది ఇండియాలోని యూఎస్​మిషన్​. బీ1 అంటే బిజినెస్​ వీసా. బీ2 అంటే టూరిజం వీసా. అంతేకాకుండా.. ముంబైలోని కాన్సులేట్​ జనరల్​.. వీక్​డేస్​లో పని గంటలను పెంచుకుంది. అదనంగా వస్తున్న అపాయింట్​మెంట్స్​కు ఇది ఉపయోగపడుతుంది. వేసవి నాటికి.. ఇండియాలో యూఎస్​మిషన్​ సిబ్బంది సంఖ్య.. కొవిడ్​(Covid) ముందు స్థాయికి చేరుతుందని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. ఇండియాలో అత్యధిక యూఎస్​వీసా అప్లికేషన్లు ముంబైలోని కాన్సులేట్‌కు వెళుతాయి. వీసా అప్లికేషన్ (Application) కార్యకలాపాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కాన్సులేట్ ఇదే అని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అంతర్జాతీయ పర్యాటకుల వీసాల వెయిటింగ్​పీరియడ్‌ను తగ్గించేందుకు మా కాన్సులర్​బృందాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి.

(CURRENT AFFAIRS: ఉగ్రవాదిగా అబ్దుల్ రెహమాన్ మక్కీ)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -