end

Group 4 Notification:తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌!

  • త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల
  • పలు శాఖల్లో ఖాళీలను పూరించేందుకు రంగం సిద్ధం

TSPSC Group 4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్‌ (Telangana Minister Harish Rao)అధికారికంగా ప్రకటించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయా పోస్టులకు రిక్రూట్‌మెంట్ (Recruitment) ప్రాసెస్‌ (prosess) కూడా ప్రారంభమైంది. ఇక మిగిలిన విభాగాల్లోని పోస్టులను భర్తీ చేసేందుకు TSPSC కసరత్తులు మొదలుపెట్టనుంది. ఈ క్రమంలోనే గ్రూప్ 4కు సంబంధించిన పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూల్లో(Siddipet Multi Purpose High School) కానిస్టేబుల్‌, ఎస్సై (Constable, SI) ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు (EGGS) పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు.. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 91 వేల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయనుంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో 17 వేలకు పైగా పోలీసు (Police) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ఆ శాఖలో మరో 2 వేల పోస్టులను (Posts)కూడా భర్తీ చేస్తాం. వీటిల్లో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి హరీష్‌ అన్నారు. కేంద్రం అగ్నిపథ్‌ (Agnipath) పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని, యువత జీవితాల్ని నాశనం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది’ అని కేంద్ర ప్రభుత్వ తీరును మంత్రి విమర్శించారు.

(Nizamabad:యూట్యూబ్ క్లాసెస్ విని నీట్ ర్యాంక్ కొట్టిన యువతి..)

Exit mobile version