end

Tirupati:తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

  • ప్రత్యేక రైళ్లను నడుపనున్న సౌత్ సెంట్రల్ రైల్వే

తిరుపతి వెళ్లే ప్రయాణికుల సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ (South Central Railway Good News)చెప్పింది. పలు రూట్లలో (Routes) ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని (Telugu states) ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్‌ను నడిపించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి – సికింద్రాబాద్ (Secunderabad-Tirupati, Tirupati – Secunderabad)మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.

ఈ రైలు జనవరి (January) 27వ తేదీన సికింద్రాబాద్ నుంచి రాత్రి 07.05 గంటలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 07.50 గంటలకు తిరుపతి చేరుతుంది. ఇక తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు కూడా స్పెషల్ ట్రైన్ (Special train) ఉంది. జనవరి 28వ తేదీన తిరుపతి నుంచి రాత్రి 08.25 నిమిషాలకు ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.30 నిమిషాలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరుతో పాటు రేణిగుంట స్టేషన్లలో (At Nalgonda, Miryalaguda, Nadikuda, Sattenapalli, Guntur, Tenali, Bapatla, Cheerala, Ongole, Nellore, Gudur and Renigunta stations) ఆగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ 1 క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ తో పాటు స స్లీపర్, సెకండ్ క్లాస్ జనరల్ కోచ్ (AC 1st Class, AC 2nd Tier, AC 3rd Tier along with Sleeper, Second Class General Coach)లు ఉంటాయని అధికారులు తెలిపారు.

(74వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేకతలు)

ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎంఎంటీఎస్ (Hyderabad MMTS) సర్వీసులకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. నిర్వహణ కారణాలతో ఇవాళ అంటే జనవరి 25న భారీగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ (Lingampally-Hyderabad) మధ్య నడిచే 47135, 47137 నంబర్ గల రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్, లింగంపల్లి మధ్య నడిచే 47111, 47110, 47119 నంబర్ గల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక లింగంపల్లి, ఫలక్ నామా (Lingampally, Falak Numa)మధ్య నడిచే 47181, 47186, 47181, 47183, 47185, 47117 నంబర్ గల రైళ్లు రదయ్యాయి. ఫలక్ నూమా, లింగంపల్లి మధ్య 47160, 47216, 47161, 47158 నంబర్ గల గల ఎంఎంటీఎస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. హైదరాబాద్-లింగంపల్లి మధ్య 47110, 47119 గల రైళ్ల సేవలు కూడా తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version