end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు
- Advertisment -

ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు

- Advertisment -
- Advertisment -
  • సిఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఏపీ ఎన్జీఓ సంఘం

ఈ నెల 29న ‘ధ‌ర‌ణి’ పోర్టల్‌ షురూ..

ఏపీ ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు చెప్పారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో కోత విధించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ఎన్జీవో సంఘం ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎన్జీఓ సంఘం ప్రతినిధులు సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇదేగాకుండా పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ అమలు విషయంలో కూడా సీఎం జగన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు వివరించారు.

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌

అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని అడిగామని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. అదే విధంగా డిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

ముంబై ముందు చెన్నై నిలుస్తుందా..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -