end
=
Friday, November 22, 2024
వార్తలుజాతీయంమెట్రో రైళ్ల ప్రారంభంపై త్వరలో నిర్ణయం
- Advertisment -

మెట్రో రైళ్ల ప్రారంభంపై త్వరలో నిర్ణయం

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన  మెట్రో రైళ్లు తిరిగి నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి జిమ్ లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూను కూడా కేంద్రం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇక మిగిలిపోయినవి సినిమా హాళ్లు, మెట్రో రైళ్లే. వీటిని కూడా వచ్చే నెలలో తెరిచేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.

వచ్చే రెండు వారాల్లో పట్టణ మెట్రో రవాణా వ్యవస్థలను తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మొదట్లో ఎక్కువ మందిని ప్రయాణించకుండా ఉండటానికి సేవలను అస్థిరమైన రీతిలో పున: ప్రారంభించాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ లను అరికట్టేందుకు మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభించడం ఒక్కటే మార్గమమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు మెట్రో రైళ్లు నడిపేలా అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు.

“రాబోయే రెండు వారాల్లో మెట్రో రైల్ వ్యవస్థలను తెరవడానికి పిలుపునిస్తాం. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు అమలులో ఉన్నాయి. మెట్రో రైళ్లను తిరిగి నడపడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే పరిమిత ఆక్యుపెన్సీతో అనుమతి ఇచ్చేందుకు యోచిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర ముఖ్యమైన సేవలు వంటి వ్యక్తుల యొక్క 50 శాతం సామర్థ్యం కంటే ఎక్కువ కాదు” అని మంత్రి చెప్పారు .

దేశంలోని అన్ని మెట్రో వ్యవస్థలను ఒకేసారి తెరవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నెలాఖరులోగా మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను అన్లాక్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను ఆవిష్కరించినప్పుడు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం మెట్రో రైళ్లను తెరవడానికి సిద్ధంగా ఉన్నదని ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22 నుంచి ఢిల్లీ మెట్రో మూసివేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -