end
=
Sunday, January 19, 2025
సినీమా‘జై బాలయ్య’ అంటూ డ్యాన్స్ చేసిన బామ్మ
- Advertisment -

‘జై బాలయ్య’ అంటూ డ్యాన్స్ చేసిన బామ్మ

- Advertisment -
- Advertisment -

బాలయ్య సినిమా షూటింగ్‌లో ఓ బామ్మ సందడి చేసింది. విజిల్స్ వేస్తూ ‘జై బాలయ్య’ అంటూ తన అభిమానాన్ని చాటింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ కర్నూలులో షూటింగ్ లో సందడి చేస్తున్నారు. బాలకృష్ణ 107 షూటింగ్‌లో భాగంగా కర్నూలు నగరంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు. అంత్యక్రియల సీన్‌ను కర్నూలు నగర వీధుల్లో చిత్రీకరిస్తున్నారు. పూలతో అలంకరించిన వ్యాన్‌లో బాలకృష్ణ, శృతిహాసన్ మిగిలిన నటీనటులు ప్రయాణించారు. ఈ సందర్భంగా బాలయ్యను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. జైబాలయ్య అంటూ నినాదిస్తూ సందడి చేశారు.

అయితే బాలయ్యను చూసేందుకు వచ్చిన జనాల్లో ఓ పెద్దావిడ అందరి దృష్టి ఆకట్టుకుంది. బాలయ్యను చూసిన ఆనందం లో డ్యాన్స్ చేస్తూ విజిల్స్ వేస్తూ ‘జై బాలయ్య’ అంటూ అక్కడ ఉన్న అభిమానులను ఆకట్టుకుంది. ఒక్కసారిగా అందరి దృష్ట్రి తన మీదికి వెళ్లింది. ఈ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. అంతేకాదు, బాలయ్యను చూసేందుకు తరలివచ్చిన జనాలతో నిండిపోయిన రోడ్ల ఫోటోస్, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. రాజకీయ సభను తలపించేంత మంది జనాన్ని చూస్తే.. బాలయ్యకు ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యం కలుగుతుంది. బాలయ్యను చూసేందుకు తరలివచ్చిన జనాలతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -