end

Cricket:భారత్ అద్భుత విజయం…

  • భారత్ -పాక్ మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ
  • నీదా.. నాదా అనే రితీలో  సాగిన టీ20 మ్యాచ్
  • మాజీ సారధి విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్
  • సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల ప్రశంసలు

టీ20 ప్రపంచకప్‌‌లో భారత్‌- పాక్ (Ind vs pak) మ్యాచ్ (Match)అంటేనే నరాలు తెగే ఉత్కంఠ. అదే మాటను నిజం చేస్తూ సాగిన ఈ మ్యాచ్‌లో విజయం (victory)నీదా… నాదా అనే రితిలో చివరి వరకూ సాగింది. ఆఖరి ఓవర్ (over)వరకూ టెన్సన్ (tensan)పెట్టిన ఆటలో చివరగా ఇండియా (india won)విజయం సాధించింది. సూపర్-12లో ఆదివారం (sunday)జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిరాశకు గురైన భారత క్రికెట్ అభిమానుల్లో ఒక్కసారిగా ఎనలేని ఉత్సహం. మాజీ సారధి విరాట్ కోహ్లీ (virat kohli)అద్భుత ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే. అసలు గెలుస్తుందా లేదా అనుకున్న మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థిపై భారత్ విజయం సాధించడంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

ఈ మధ్య జరిగిన గ్రేట్‌ మ్యాచ్‌ (great match)ఇదే కావచ్చు బహుశా.  160 పరుగుల (160 target)లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగుల వద్ద 4 వికెట్లు(wikets) కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై క్రీజులోకి వచ్చిన కోహ్లి, హార్దిక్ (hardhik)లు 78 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యాన్ని(partnership) నెలకొల్పారు. భారత్ ఓడిపోతుందనే నిరాశలో చాలామంది ఉన్నారు. అయితే 18వ ఓవర్ లో 17 పరుగులు రావడంతో గెలుపుపై ఆశలు చిగురించాయి. అయితే 19వ ఓవర్ లో తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే రావడంతో భారత క్రికెట్ అభిమానుల్లో మళ్లీ నిరాశ.. ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు. అయితే 19వ ఓవర్ ఐదో బంతి, ఆరో బంతికి వరుసగా రెండు సిక్స్ (six)లు కొట్టడంతో.. మళ్లీ ఉత్సాహం. చివరి ఓవర్ లో గెలుపు కోసం భారత్ 16 పరుగులు (runs)కొట్టాలి. ఆ సమయంలో కోహ్లీ అద్భుతం చేశాడు. నో బాల్‌లో స్పిన్నర్ నవాజ్ బంతిని సిక్సర్ బాదాడు. దీని తర్వాత, అతను ఫ్రీ హిట్‌లో (free hit)బౌల్డ్ (bould)అయినప్పుడు కూడా 3 పరుగులు తీశాడు. 2 పరుగులు అవసరమైతే దినేష్ కార్తీక్ (dinesh karthik)అవుటయ్యాడు. అశ్విన్ (ashwin)రాగానే నవాజ్ వైడ్ (wide)విసిరాడు. దీంతో అశ్విన్ ఒక్క పరుగు చేసి విజయం సాధించాడు.

(Cricket: టీమిండియా సారథి రోహిత్ శర్మ)

అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ (rohith)ముందుగా బౌలింగ్ (bowling)ఎంచుకున్నాడు. బౌలర్లు (bowlers) నిర్ణయం సరైనదని నిరూపించారు. దీంతో పాక్ (pak)జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. టీమిండియా ముందు 160 పరుగుల టార్గెట్‌ని ఉంచింది. భారత్ తరపున హార్దిక్, అర్ష్‌దీప్ (arshdeep)చెరో 3 వికెట్లు పడగొట్టారు. షమీ, భువీ (bhuvi)ఖాతాల్లో ఓ వికెట్‌ చేరింది. పాండ్యా 14వ ఓవర్లో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను కష్టాల్లో పడేశాడు. పాకిస్థాన్ తరపున ఇఫ్తికర్ (ifthikar)51 పరుగులతో ఇన్నింగ్స్ (innings)ఆడాడు. 4 సిక్సర్లు కూడా కొట్టాడు. షాన్ మసూద్ (masud)52 పరుగులతో నాటౌ‌ట్‌గా నిలిచాడు.

భారత్ గెలవదేమోననే అనుమానం.. రెండో బంతికి సింగిల్ రాగా, మూడో బంతికి రెండు పరుగులు రావడంతో టెన్షన్ (tensan)పెరిగిపోయింది. మూడు బంతుల్లో 13 పరుగులు కొట్టాలి. నాలుగో బంతి ఏం జరుగుతందోననే ఆందోళన. అయితే ఆ బాల్‌ను బౌలర్ మహ్మద్ నవాజ్ (nawaz)నోబ్ వేయగా ఆ బంతిని కోహ్లీ సిక్స్ కొట్టాడు. దీంతో భారత్ విజయం పక్కా అనే కాన్ఫిడెన్స్ (confidence)వచ్చింది. తరువాత బంతి వైడ్‌గా వేయడంతో.. ఆ తర్వాత బాల్ కు మూడు పరుగులు చేశారు. రెండు బంతుల్లో రెండు పరుగులు కొట్టాల్సిన సమయంలో ఐదో బంతికి దినేష్ కార్తీక్ అవుటయ్యాడు. మరోసారి టెన్షన్.. చివరి బంతికి రెండు పరుగులు కొట్టాలి. అయితే ఆరో బాల్ ను వైడ్ గా వేయడంతో ఇరు జట్ల స్కోర్లు (scores)సమం అయ్యాయి. దీంతో భారత క్రికెట్ అభిమానుల్లో ఉత్సహం కనబడింది. చివరి బంతికి విజయం కోసం ఒక పరుగు కొట్టాల్సి ఉండగా.. రవిచంద్ర అశ్విన్ సింగిల్ తీయడంతో ఉత్కంఠ పోరులో భారత్ గెలుపొందింది. దీంతో ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా: (Home Minister Amit Shah:)

టీమిండియా విజయం పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. టీ20 ప్రపంచకప్ ను భారత్ విజయంతో ప్రారంభించిందని, ఈ విజయంతో దీపావళి ప్రారంభమైందని ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీది వాట్ ఎ ఇన్నింగ్స్ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్న ఆయన భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

బీసీసీఐ (BCCI) శుభాకాంక్షలు:

బీసీసీఐ కూడా భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి టర్నింగ్ బ్యాక్ టైమ్ అంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. ఫామ్ లోకి వచ్చి ఈ మ్యాచ్ లో తన నైపుణ్యాన్ని చూపించాడని, అతడి సామర్థ్యానికి ఈరోజు సాక్ష్యమంటూ బీసీసీఐ ట్వీట్ చేసింది. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపింది.

సచిన్ టెండూల్కర్: (Sachin tendulkar)

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పాకిస్తాన్ పై భారత్ గెలువడంపై ట్విట్టర్ లో స్పందించారు. T20 ప్రపంచకప్ ను భారత్ బాగా ప్రారంభించిందని, ఈ గేమ్ ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చిందని ట్వీట్ చేశారు. జట్టు సమిష్టి కృషితో, జట్టు సభ్యుల కీలకమైన సహకారంతో భారత్ విజయం సాధించిందన్నారు. విరాట్‌ కోహ్లీ, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు టెండూల్కర్.

వీరేంద్ర సెహ్వాగ్ : (SEHWAG)

సెహ్వాగ్ కూడా భారత్ గెలుపుపై స్పందించారు. హ్యాపీ దీపావళి అంటూ ట్వీట్ చేశారు. వాట్ యాన్ అమైజింగ్ గేమ్ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. హై ఎమెషన్స్ తో కూడుకున్నదని, తాను బ్రిలియంట్ టీ20 ఇన్నింగ్స్ ను చూశాను.. చక్ దే ఇండియా అంటూ ట్వీట్ చేశారు సెవ్వాగ్.

(T20 Ranks :ఇండియానే నంబర్ 1)

Exit mobile version