end
=
Friday, September 20, 2024
ఉద్యోగ సమాచారంTSPSC Group1:గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షా విధానం!
- Advertisment -

TSPSC Group1:గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షా విధానం!

- Advertisment -
- Advertisment -

మెయిన్స్ (mains) పరీక్షల్లో 6 ప్రధాన సబ్జెక్టులతో (subject) పాటు జనరల్ ఇంగ్లీష్ (English) క్వాలిఫైయింగ్ పరీక్ష ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగతా 6 పేపర్లను పరిగణలోకి తీసుకొని మూల్యాంకనం చేస్తారు. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. 150 మార్కులకు ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఈ మార్కులను మెయిన్స్‌ పరీక్షల్లో కలపరు. ఈ పేపరు పరీక్ష సమయం రెండున్నర గంటలు. మెయిన్స్ పరీక్షల్లో నిర్వహించే మొత్తం 6 పేపర్లలో.. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్కో పేపరుకు 3 గంటల సమయం.
మెయిన్స్ ఎగ్జామ్ పూర్తిచేసిన అభ్యర్థులకు గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఇంటర్వూలు ఎత్తేశారు. దీంతో 900 మార్కులకే గ్రూప్ -1 మెయిన్స్ నిర్వహించనున్నారు.
ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపికలో కేవలం ఈ 6 పేపర్లలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షా విధానం:
పేపర్‌-1 : జనరల్‌ ఎస్సే
ఈ పేపర్‌లో మూడు సెక్షన్‌లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు కేటాయించారు. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ఇది వెయ్యిపదాల్లో ఉండాలి. మూడు సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.

పేపర్‌-2 : చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ
పేపర్‌-3 : భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన

పేపర్‌-4 : ఎకానమీ, డెవలప్‌మెంట్‌
పేపర్‌-2, 3, 4లలో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు 10 మార్కులు ఉంటాయి. అయితే ఒక్కో సెక్షన్‌లో 5 ప్రశ్నల్లో తొలి 2 ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. 3, 4, 5 ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.

(Telangana:తెలంగాణ సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!)

పేపర్‌-5 : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌
ఇందులో 3 సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్షన్లలో 5 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఈ సెక్షన్లలో తొలిరెండు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి. మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్‌ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి. ఇక మూడో సెక్షన్‌లో మొత్తం 30 ప్రశ్నలుంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.

పేపర్‌-6 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో 5 ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి. ఒక్కోప్రశ్నకు 10 మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది. అయితే ఒక్కో సెక్షన్‌లోని 5 ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందులో ఛాయిస్‌ ఉండదు. 3, 4, 5 ప్రశ్నల్లో ఛాయిస్‌ ఆప్షన్‌ ఉంటుంది.

గమనిక:
జనరల్‌ ఇంగ్లీష్‌: ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో పదిహేను ప్రశ్నలు ఉంటాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -