end

Telangana: 5 లక్షలు దాటిన గ్రూప్‌-4 దరఖాస్తులు!

గ్రూప్ 4 ఉద్యోగాలకు (Group 4 Recruitment ) భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే ఐదు లక్షలకుపైగా దరఖాస్తుల సంఖ్య దాటినట్లు తెలుస్తోంది. జనవరి 30వ తేదీ గడువు ముగియనుంది. తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్లు రావటంతో అభ్యర్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇందులో కీలమైన గ్రూప్ 1, 2,3 పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి తోడు భారీ పోస్టులతో గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకుగానూ అభ్యర్థుల నుంచి భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటికే 5 లక్షలకుపైగా ఆప్లికేషన్లు దాటిపోయాయి. జనవరి 30వ తేదీ వరకు గడువు ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీలో భాగంగా మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9168 ఉద్యోగాలను టిఎస్‌పిఎస్సీ భర్తీ చేయనుంది. https://tspsc.gov.in/ లింక్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఓటీఆర్ తప్పనిసరిగా ఉండాలి.

9,168 పోస్టులు
మెుత్తం 9,168 పోస్టుల భర్తీకి కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏప్రిల్ లేదా మే (may) నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. గ్రూప్‌ 4లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు (Junior Assistant Post)లు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖ 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. గతంలోని గ్రూప్ 2లో 663 పోస్టులు గుర్తిస్తూ.. టీఎస్‌పీఎస్సీ (TSPSC) ఉత్తర్వులు ఇచ్చింది.

పోస్టుల వివరాలు;
అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ డిపార్ట్ మెంట్-44, యనిమల్ హస్పెండరీ, డెయిరీ డెవలప్ మెంట్ అండ్ ఫిషరీస్-2, బీసీ వెల్ఫేర్-307, కన్స్యూమర్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్ మెంట్-72, ఎనర్జీ డిపార్ట్ మెంట్-2, ఎన్విరాన్ మెంట్, ఫారెస్ట్, సైన్స్ (Animal Husbandry, Dairy Development and Fisheries-2, BC Welfare-307, Consumer Affairs Food and Civil Supply Department-72, Energy Department-2, Environment, Forest, Science) అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్-23, ఫైనాన్స్-255, జనరల్ అడ్మినిస్ట్రేషన్-5, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్-338, ఉన్నత విద్యాశాఖ-742, హోమ్ డిపార్ట్ మెంట్-133, పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖ-7, వ్యవసాయ శాఖ-51, కార్మిక, ఉపాధి కల్పన శాఖ-128, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్-191, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్-2701, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్-1245, ప్లానింగ్ డిపార్ట్ మెంట్-2, రెవెన్యూ-2077, ఎస్సీ డెవలప్ మెంట్-474, సెకండరీ ఎడ్యూకేషన్-97, ట్రాన్స్ పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్-20, ట్రైబల్ వెల్ఫేర్-221, స్త్రీ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ-18, యూత్, టూరిజం, కల్చర్-13 (Revenue-2077, SC Development-474, Secondary Education-97, Transport, Roads and Buildings-20, Tribal Welfare-221, Women, Child, Disabled, Elderly Department-18, Youth, Tourism, Culture-13) వంటి పోస్టులన్నాయి.

ఇదిలా ఉంటే.. గ్రూప్​-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్ఓ పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీఓ పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 38 చేనేత ఏడీఓ పోస్టులు, 25 ఆర్థికశాఖ ఏఎస్ఓ పోస్టులు, 15 అసెంబ్లీ ఏఎస్ఓ పోస్టులు, 14 గ్రేడ్ టూ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు, 11 గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ పోస్టులు, తొమ్మిది ఏఎల్ఓ, ఆరు న్యాయశాఖ ఏఎస్ఓ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్-2 ఏఈఓ పోస్టులు, 148 ఏఓ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఉద్యానవన శాఖలో 21 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సహకారశాఖలో 63 అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. 36 జూనియర్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.

పశుసంవర్ధకశాఖలో 183 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, 99 వెటర్నరీ అసిస్టెంట్ సహా 294 పోస్టుల భర్తీకి అనుమతి మంజూరైంది. విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి, ఆరు ఆర్గానిక్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మత్య్సశాఖలో తొమ్మిది ఎఫ్​డీఓ, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్​స్పెక్టర్ పోస్టులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు ఉంటాయి. ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతితో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని అధిగమించినట్లు ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు (Harish rao) చెప్పారు. గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 18 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

(Scholarship:PG విద్యార్థులకు రూ.6 లక్షల స్కాలర్షిప్)

Exit mobile version