end

Guava: జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు

ఆడవారిలో ఐనా మగవారిలో ఐనా అందం(Beauty) గా కనిపించాలి అంటే జుట్టు తోనే సాధ్యం. అమ్మాయిలు అయితే రకరకాల హైర్ స్టయిల్(Hair Styles) తో ఇంకా అందం గా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు రాలడం ఇప్పుడు ఒక పెద్ద సమస్య గా మారింది. ఇది ఒక న్యాచురల్ రెమిడీ(Natural Remedy) మీ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ప్రస్తుత రోజుల్లో వయసు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్న వారే. మన జుట్టు ని కాపాడుకోవడానికి ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరికింది. జుట్టు రాలడాన్ని వేగంగా తగ్గించడమే కాకుండా జుట్టు పెరగడానికి  సహాయపడతాయి. జామ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

 (‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!)

జామ ఆకులలో యాంటీ డయాబెటిక్(Anti Diabetic) లక్షణాలు ఉంటాయి. ఇందులో ఉండే  బయోయాక్టివ్‌ కాంపౌడ్స్‌, శరీరంలోని చక్కెర స్థాయిలను(Sugar Levels), కేలరీలను తగ్గిస్తాయి. జామ ఆకులో ఉండే బయోయాక్టివ్‌ కాంపౌడ్స్‌, శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఇది బరువు తగ్గడాని(Weight Loss)కి కి కూడా సహాయపడుతుంది. జమ ఆకులకి సంతానోత్పత్తి(Fertility)ని పెంచే సామర్థ్యం ఉంది. జామ ఆకులలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు స్పెర్మ్ టాక్సిసిటీపై ప్రయోజనకర ప్రభావం చూపుతాయి. ఇది పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. ముఖం వచ్చే మొటిమలు(Pimples) పోవడానికి జామ ఆకుల పేస్ట్ బాగా పనిచేస్తుంది.

(త్వరగా సన్నగా అవ్వాలంటే..)

జామ ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గించడానికి న్యాచురల్ సొల్యూషన్. అలాగే కొత్త జుట్టు రావడానికి ఇందులో ఉండే విటమిన్ బి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి చాలా అవసరం. డెంగ్యూతో బాధపడే వారు కొన్ని జమ ఆకులని తినడం ద్వారా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. జుట్టు పెరగడం కోసం కొన్ని జామాకులు తీసుకుని నీటిలో 20నిమిషాలు వేడిచేయాలి. గోరువెచ్చగా ఐనా తర్వాత ఆ నీటితో స్కాల్ప్(Scalp) ని మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రాత్రి పడుకోవడానికి ముందు మసాజ్ చేసుకుని ప్రొద్దున బాత్ చేస్తే మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈ జామ ఆకుల సొల్యూషన్ ఖచ్చితంగా మీ జుట్టు రాలే సమస్యను ఖచ్చితంగా నివారిస్తుంది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టుకుదుళ్లు బలపడి జుట్టు మళ్లీ పెరగడానికి సహాయపడుతుంది. ఇంకెందుకు వేచి చూడటం వెంటనే ప్రయత్నించి స్వయం గా మీరే తెల్సుకోండి.

Exit mobile version