- గెలుపుపై దీమాతో బీజేపీ, మోడీ
- హిమాచల్ ప్రదేశ్‌పై నమ్మకంతో కాంగ్రెస్
- కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసిన ఈసీ
దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Gujarat and Himachal Pradesh Assembly Election Results) గురువారం వెలువడనున్నాయి. 68 నియోజకవర్గాలున్న (constituencies) హిమాచల్ ప్రదేశ్‌లో గత నెల 12న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. 66శాతం పోలింగ్ నమోదైంది. ఇక, 182 స్థానాలున్న గుజరాత్ (Gujarat)లో రెండు దశలుగా పోలింగ్ జరిగింది. ఈ నెల 1న 89 నియోజకవర్గాలకు తొలి దశలో, 5న 93 స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. రెండు దశలు కలిపి 64.30శాతం పోలింగ్ నమోదైంది. వీటి ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది.
ఇక ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కానున్నట్టు తెలిపింది. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ (CEC Rajeev Kumar, Election Commissioners Anup Chandra Pandey, Arun Goel ) నేతృత్వంలోని భారత ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు సన్నాహాలను సమీక్షించింది. ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించనుండగా, హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం స్వల్ప మెజారిటీతో గట్టెక్కనుందని తేల్చాయి. ఈ క్రమంలోనే కాషాయపార్టీపై (BJP) రెండు రాష్ట్రాల్లోనూ గెలుస్తామనే దీమాతో ఉంది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్‌లోని హోరాహోరీ పోరులో తామే గెలుస్తామని కాంగ్రెస్ (CONGRESS)విశ్వాసంతో ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేసిన ఆప్ (AAP) మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నట్టు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
(Stock Market:స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు!)
మరో 7 స్థానాల బైపోల్ రిజల్ట్స్:
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతోపాటే మరో 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, యూపీలోని (UP) ఓ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలు సైతం గురువారమే వెలువడనున్నాయి. దీంతో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌తోపాటు ఉప ఎన్నికలకు సంబంధించి 116 కౌంటింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేయగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వీటిని సమీక్షించారు.