end

Paytm డేటా సర్వర్లపై హ్యాకర్లు దాడి

  • వినియోగదారుల డేటా చోరి
  • అంతర్జాతీయ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ వెల్లడి
  • డేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి

పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ సంస్థ పేటిఎం డేటాబేస్‌ సర్వర్స్‌పై జాన్‌ విక్‌ అనే గ్రూప్‌కు చెందిన హ్యాకర్లు దాడి చేసినట్లు సైబిల్‌ అనే అంతర్జాతీయ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ తెలిపింది. డేటాను తిరిగి ఇచ్చేందుకు హ్యాకర్లు పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

గోనె సంచిలో మహిళ మృతదేహం !

అయితే పేటిఎం డేటాబేస్‌ సర్వర్స్‌లో లోపాలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పి హ్యాకర్లు వినియోగదారుల డేటాను తస్కరించినట్లు సైబిల్‌ పేర్కొంది. ఎవరో పేటిఎం సంస్థలో పనిచేసే లోపలి వ్యక్తుల సహాయ సహకారాలతోనే హ్యాకర్లు డేటాను చోరీ చేసినట్లు తెలిపింది. హ్యాకర్లు డిమాండ్‌ చేసి పెద్ద మొత్తాన్ని పేటిఎం సంస్థ సిద్దపడిందని సైబిల్‌ సంస్థ తెలిపింది.

యాల‌కుల‌తో శృంగార స‌మ‌స్య‌ల‌కు చెక్‌

ఇదిలావుండగా దీనికి సంబంధించి పేటిఎం అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదు. సర్వర్లు అన్ని సురక్షితంగా ఉన్నాయని, వినియోగదారుల డేటా చోరీ అవలేదని సైబిల్‌ ఏజెన్సీ తెలిపిన వివరాలను ఖండించారు. వినియోగదారుల డేటా సురక్షితం కోసం ప్రతీ సంవత్సరం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. అయితే సంస్థలో అంతర్గత విచారణ చేపడుతున్నట్లు వివరించారు. ఎప్పకటిప్పుడు పేటిఎం యాప్స్‌ను సెక్యూరిటీ ప్యాచెస్ ద్వారా అప్‌డేట్‌ చేస్తున్నట్లు ప్రతినిధి తెలిపారు.

భారత్‌లో ‘ఆపిల్‌’ ఆన్‌లైన్‌ అమ్మకాలు

Exit mobile version