end

ఏపీ సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు సహా.. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా‌, బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నర్‌ బిశ్వ భూషన్‌ హరిచందన్‌ సహా పలువులు ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version