end

పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీష్‌ రావు పేదలపాలిట పెన్నిధి అయ్యాడు. ఆయన నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్పందించే హరీష్‌.. పదేళ్ల క్రితం అకాల వర్షాలకు ఓ నిరుపేద కుటుంబం ఇళ్లు పూర్తిగా కూలిపోయింది. వారికి ఆర్థిక వనరులు కూడా లేకపోవడంతో ఆ ఊర్లోని స్కూళ్లోనే తలదాచుకున్నారు. ఆ ఇంటి పెద్ద దిక్కు కూడా లేకుండా పోయింది.

కొత్త ఏడాదిలో పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్‌..!

వివరాలు చూస్తే.. ఇళ్లు కూలిన తర్వాత దిక్కుతోచని స్థితిలో ఉన్న దొంతరబోయిన బాలవ్వ, వయసులో ఉన్న తన కూతురు సర్కారు బడిలో తలదాచుకున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచకి చెందిన వీరి దీనస్థితిని ఓ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీనికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. వారి గోడు విని సొంత ఖర్చుతో ఇల్లు కట్టించారు. శనివారం దగ్గరుండి తల్లీకూతుళ్లకు కొత్త బట్టలు పెట్టి గృహ ప్రవేశం చేయించారు.

రైతుబంధు రావట్లేదా..?

Exit mobile version