end
=
Sunday, April 20, 2025
వార్తలురాష్ట్రీయంచిన్నారి ఆవేద‌న చూసి చ‌లించిన హ‌రీశ్‌
- Advertisment -

చిన్నారి ఆవేద‌న చూసి చ‌లించిన హ‌రీశ్‌

- Advertisment -
- Advertisment -

`నాన్న కొంత‌కాలం క్రితం చ‌నిపోయాడు(Father died). నా త‌ల్లి (Mother take carer)న‌న్ను చ‌దివించేందుకు ఎంతో క‌ష్ట‌ప‌డుతున్న‌ది.` అంటూ ఓ చిన్నారి స‌భావేదిక‌పై వెక్కి వెక్కి ఎడుస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. చిన్నారి మాట్లాడిన తీరు చూసి వేదిక‌పై ఆశీనుడైన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే(Ex minister) త‌న్నీరు హ‌రీశ్‌రావు(Tanniru Harish Rao) చ‌లించిపోయారు. భావోద్వేగాన్ని ఆపులేక కంట‌త‌డి పెట్టారు. వెంట‌నే పాప‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఓదార్చారు. క‌న్నీరు తుడిచి పాప‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఆవేదనకు లోను కావొద్దని తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని భ‌రోసానిచ్చారు.

 

అస‌లేం జ‌రిగిందంటే.. సిద్దిపేటకు చెందిన ఓ ప్రైవేటు స్కూలు యాజ‌మాన్యం శ‌నివారం ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే పేరుతో అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించింది. స‌ద‌స్సుకు ముఖ్యఅతిథిగా హ‌రీశ్‌రావు విచ్చేశారు. కార్యక్రమంలో సాత్విక అనే చిన్నారి మైక్ అందుకుని మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. త‌న తండ్రి చనిపోయిన విష‌యాన్ని చెప్పుకొంటూ క‌న్నీరు పెట్ట‌కున్న‌ది. తన బాధ్యతలన్నీ తల్లి ఎంతో కష్టపడి చూసుకుంటుందని చిన్నారి బావురుమంది. అందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చిన్నారి ఆవేద‌న చూసి నెటిజ‌న్లు కూడా జాలిప‌డుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -