end
=
Thursday, January 23, 2025
వార్తలురాష్ట్రీయంHarish Rao:తాగు సాగు నీరు ఇవ్వడం లో నెంబర్ వన్
- Advertisment -

Harish Rao:తాగు సాగు నీరు ఇవ్వడం లో నెంబర్ వన్

- Advertisment -
- Advertisment -

జహీరాబాద్(Zahirabad) నియోజకవర్గం పర్యటనలో భాగంగా మోగుడంపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao).మండల కేంద్రంలో సెంట్రల్ డివైడరు సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి, రైతు వేదికను ప్రారంభించిన మంత్రి అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు, జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్,ఎమ్మెల్యే మాణిక్ రావు,జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ శరత్, డి సి ఎం ఎస్ శివకుమార్, స్థానిక ప్రజా ప్రతినిధుల తో కలిసి నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల(Tribal girls) ఇంగ్లీష్ మీడియం జూనియర్ కళాశాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు విద్యార్థినిలను జీకే(GK) ప్రశ్నలు అడిగి క్విజ్ నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు.ఈ క్విజ్ పోటీలో మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాధ అనే విద్యార్థినికి మంత్రి బహుమతి ఇచ్చి అభినందించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Govt) ఏర్పడిన తర్వాత గిరిజన విద్యాలయాల సంఖ్య 91 నుండి 183 వరకు పెరిగింది.గిరిజన విద్యార్థులకు 83 ఇంటర్ స్థాయిలో గురుకులాలు, 22 డిగ్రీ గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది.తెలంగాణ రాకముందు గురుకులాల మీద 380 కోట్లు..ఇప్పుడు 3300 కోట్లు. 10 రెట్లు పెరిగింది.అప్పుడు ఉన్న గురుకులాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ, బాలికలవి 298, ఈరోజు 923 ఉన్నాయి. 5 రెట్లు పెరిగాయి.స్వరాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలలను కాలేజీలుగా సీఎం గారు అప్ గ్రేడ్ చేశారు.ఈ ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి దక్కుతుంది.ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కోటీగా పరిష్కరించుకుంటూ  అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాం.ఏ గణాంకాల్లో అయినా తెలంగాణను నెంబర్ వన్ గా నిలిపినం. తలసరి ఆదాయంలో, ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్. ఆరోగ్య రంగంలో నెంబర్ వన్ దిశగా సాగుతున్నం.

తాగు, సాగు నీరు ఇవ్వడంలో నెంబర్ వన్. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దశ- దిశ చూపుతోంది.ఇది బీజేపీకి కన్ను కుట్టినట్లవుతోంది.తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు  ఎక్కువ జరిగిన ప్రాంతం. ఇవాళ దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మార్చాం.బోర్ల దగ్గర, బావుల దగ్గర మీటర్లు పెట్టి  రైతుల ముక్కు పిండి కరెంటు చార్జీలు వసూలుచేయాలంట. చార్ఝీలు వసూలు చేస్తేనే రాష్ట్రానికి అప్పులు ఇస్తమంటున్నరు.కరెంటు మీటర్లు పెట్టాలా వద్దా…మీరే చెప్పండి.బీజేపీ వస్తే మీటర్లు వస్తయి. కరెంటు బిల్లులు వస్తయి.అదే టిఆర్ఎస్ ప్రభుత్వం జహీరాబాద్ రైతులకు ఇప్పటివరకు 742 కోట్ల రైతుబంధు రూపంలో రైతులకు అందించింది.పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం బిజెపి ఉంది. ఆ రాష్ట్రంలో 700 రూపాయల పెన్షన్ ఇస్తుంది, రైతులకు ఉచిత కరెంటు లేదు. రైతు బీమా లేదు రైతు బంధు లేదు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లేదు.ఉచితాలు వద్దంటున్నరు. పేదలకు ఇవ్వద్దంట…రైతు కు రుణ మఫీ చేయ వద్దంట. రైతుకు రైతు బంధు వద్దంట. రైతుకు ఉచిత బీమా వద్దంట. పేదలకు ఉచిత రేషన్ వద్దంట. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్పులు వద్దంట…బిజెపి ప్రభుత్వం వస్తే రైతులకు ఉచిత కరెంటు ఉండదు, రైతుబంధు ఉండదు, పేదలకు 2000 రూపాల ఆసరా పింఛన్లు ఉండదు, కల్యాణ లక్ష్మి ఉండదు.ఏ ప్రభుత్వం కావాలో మీరే చెప్పండి ? సంక్షేమం వద్దంటున్న డబల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వమా ? పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే టిఆర్ఎస్ ప్రభుత్వమా.?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -