ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాడు. ముఖ్యంగా హై బ్లడ్ ప్రెజర్(High blood pressure)తో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువే. ఇలా హై బీపీతో బాధ పడుతున్న వారు ఈ క్రింది చిట్కాలు(Tips) పాటిస్తే ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
- దాల్చిన చెక్క(Cinnamon)ను పొడి చేసి నిత్యం ఆహారంలో ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. వాటిని తినడం లేదా పొడి చేసుకొని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్(Fruit salad)లో కలుపుకొని తాగవచ్చు.
- యాలకుల(cardamom)ను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హై బీపీకి చెక్ పెట్టవచ్చు.
- వెల్లుల్లిని రోజుకు ఒకటి లేదా రెండు తినడం వల్ల హై బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
- ఆహారంలో ఉప్పు(Salt) తగ్గిస్తే చాలా మంచిది.
(Dates:ఖర్జూరతో ఎన్ని ఉపయోగాలో..!)