end

ఆకాశానికి చిల్లు పడింది..

  • అతలాకుతలమైన హైదరాబాద్‌
  • వందెండ్లలో ఇది రెండోసారి
  • 15మంది మృత్యువాత
  • 32సెం.మీ వర్షపాతం

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరుగని రీతిలో వర్షం బీభత్స సృష్టించింది. హైదరాబాద్‌లో రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై చెట్ల విరిగిపడడంతో  విద్యుత్‌ అంతరాయం ఏర్పాడింది. అధికారుల అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టారు. నగరంలోనీ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో విఎస్టీ వద్ద రాత్రి చెట్లు నెల కూలడంతో పాటు విద్యుత్‌ స్తంభం విరిగి పడింది. ఆ సమయంతో విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. నగరంలోని దంచికొట్టిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చాంద్రయణగుట్టలో చెరువు కట్ట తెగడంతో రోడ్లపై భారీగా నీరు రావడంతో ట్రావెల్‌ బస్సులు, లారీలు నీట మునిగాయి. బస్సులో ప్రయాణీకులు ఉండడంతో వారు బస్సు పైకి ఎక్కి ప్రణాలుకాపాడుకునే ప్రయాత్నం చేశారు. రాత్రంతా ద్యాగరం చేశారు. బుధవారం ఉదయం అధికారులు సహాయక చర్యలు చేపట్టి వారిని కాపాడారు. కొంతమంది కార్మికులు గోడలపై కూర్చుని ఉన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దీన స్థితిలో ఉన్నారు.

చాంద్రాయణగుట్టలో నీట మునిగిన కారు

సరూరర్‌నగర్‌, ఎల్బీనగర్‌, మందమల్లమ్మ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ సమీపంలో రెండు చెరువులకు గండిపడడంతో రోడ్డుపై వరద బీభత్సావానికి కార్లు, బైకులు వరదలో కొట్టుకుపోయాయి. ఇక్కడ బస్సుపై, లారీలో ఇరుక్కపోయిన వారిని జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎస్‌ సిబ్బంది మీనీ పడవల సాయంతో కాపాడే ప్రయాత్నం చేయగా వరదదాటికి పడవకూడా తలకిందులై ఒక్కరి మృతి చెందారు. పాత బస్తీలో ఇల్లు కూలీ 9మంది మృతి చెందారు. ఇబ్రహీంపట్నంలో గోడ కూలడంతో తల్లీకూతురు మృతి చెందారు. కూకట్‌పల్లి ఆల్వీన్‌కాలనీ వద్ద నాలా పొంగి రోడ్డుపై ప్రవాహిస్తోంది. మురుగు నురుగు రోడ్డుపై చేరడంతో పరిసార ప్రాంతల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు వాసనకు శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో బోట్ల సహాయంతో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  వేల అపార్టుమెంటులో నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా లిప్టులు ఆప్‌ చేశారు.

తెలంగాణలో వర్ష భీభత్సం

నగరంలోని నీరంత ముసినది గుండా ప్రవాహిస్తుండడంతో నది ఉదృతంగా ప్రవహిస్తోంది. పక్కన కాలనీల ప్రజలు భయం గుప్పిట్లో  కాలం వెల్లదీస్తున్నారు. మూసి పరివాహక కాలనీల ప్రజలకు జీహెచ్‌ఎంసీ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.  ఉస్సేన్‌ సాగర్‌ నిండుకుండాల మారింది.  దిగువకు నీరు వదలండంతో మూసి ప్రమాద స్థాయిలో ప్రవాహిస్తుంది.  

కాప్రాలో నెల కూలిన చెట్టు

నగరంలోని  కాలనీల్లో చెట్లు విరిగిపడడంతో పాటు దిగువ ప్రాంతాల్లో వ్యాపార సంస్థల్లో నీరు చేరడంతో యాజమానలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్తి నష్టం కూడా వాటిల్లడంతో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మల్కజ్‌గిరి వసంతపురి కాలనీలో వరదనీరు వ్యాపార సంస్థలు, ఇండ్లలోకి భారీగా చేరింది. శ్రీసాయి మెడికల్‌ షాపులోని భారీగా నీరు చేరడంతో షాపులో ఉన్న మెడిసిన్‌ పూర్తిగా నీటిలో కొట్టుకపోయాయి. సూమారు రూ. లక్ష మేర ఆస్తి నష్టం జరిగిందని యాజమాని తెలిపారు. ఇదే కాకుండా అక్కడున్న ఇతర వ్యాపార సంస్థల్లోకి నీరు చేరింది.

ఆపిల్’‌ స్పెషల్‌ ఈవెంట్‌ @ 10:30 PM

అర్థరాత్రి అత్యసవర సమావేశం

వర్షం బీభత్సం సృష్టించడంతో సీఎం కేసీఆర్‌ అర్ధరాత్రి వర్షాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అన్నివిధాలా సన్నద్ధంచేసి తక్షణం సహాయచర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అప్పటికప్పుడే అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్షాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. మరోవైపు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితోనూ సీఎం మాట్లాడారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సీఎం ఆదేశానుసారం డీజీపీ.. అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడారు.

ముంపు ప్రాంతాల ప్రజలకు సహాయకార్యక్రమాలపై తక్షణ చర్యలకు ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై విద్యుత్‌ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎండీ ప్రభాకర్‌రావు అర్ధరాత్రి 12 గంటల సమయంలో హుటాహుటిన విద్యుత్‌ సౌధకు చేరుకొని గ్రిడ్‌ సమస్య తలెత్తకుండా రక్షణ చర్యలు చేపట్టారు. మరోవైపు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడారు. పట్టణాలు, నగరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయచర్యలు చేపట్టాలని, సమాంతరంగా పునర్నిర్మాణ కార్యక్రమాలను  కొనసాగించాలని ఆదేశించారు.

మల్కజ్‌గిరి వసంతపురి కాలనీలో నీట మునిగిన శ్రీసాయి మెడికల్‌ స్టోర్‌

అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్‌శాఖలోని అన్ని విభాగాలను, అన్ని స్థాయిల్లోని అధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి అలర్ట్‌చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏ విధమైన ప్రాణనష్టం జరుగకుండా ముందస్తుచర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.  ప్రతి అధికారి ఎమర్జెన్సీ విధుల్లో ఉండాలని స్పష్టంచేశారు.

జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌

ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని కలిసి పనిచేయాలన్నారు. పురాతన, శిథిల భవనాలు కూలే పరిస్థితిలో ఉంటే నివాసితులను రెవెన్యూ, తదితర శాఖలతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులున్నా డయల్‌ 100 కు ఫోన్‌ చేయాలని, ప్రజలెవరూ ఇండ్లనుంచి బయటకు రావొద్దని డీజీపీ పిలుపునిచ్చారు. చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. 

ప్రమాదకరంగా ప్రవాహిస్తున్న మూసి
నీట మునిగిన కాలనీ
Exit mobile version