end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంప్రసంగిస్తూ కుప్పకూలి మృతి
- Advertisment -

ప్రసంగిస్తూ కుప్పకూలి మృతి

- Advertisment -
- Advertisment -

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని కాప్రా పరిధిలోని వంపుగూడ లక్ష్మీ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో విషాదం నింపింది. స్థానిక నివాసి, వ్యాపారి అయిన ఉప్పల సురేష్ జెండా వందనం తర్వాత సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడిక్కడే మృతి చెందారు. గుండె పోటుకు గురై ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఈ విషాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న సురేష్ తండ్రి యాదగిరి, భార్య కరుణ, కూతురు మైత్రి, కుమారుడు ధర్మపాల్ దిగ్బ్రాంతి కి లోనైయ్యారు. ఉప్పల సురేష్ బాగ్ అంబర్ పేట పరిధిలోని డి.డి. కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. తన కళ్ల ముందే కొడుకు మృతి చెందటం బాధాకరం అంటూ తండ్రి యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల సురేష్ మృతి పట్ల రచయిత, సీనియర్ కళాకారుడు మల్లం రమేష్ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -