end
=
Saturday, January 18, 2025
క్రీడలుShubman Gill:ఆయన బ్యాటింగ్ చూసి చాలా నేర్చుకున్నా!
- Advertisment -

Shubman Gill:ఆయన బ్యాటింగ్ చూసి చాలా నేర్చుకున్నా!

- Advertisment -
- Advertisment -
  • రెండో వన్డేలో విజయం సాధించిన భారత్
  • మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం

శ‌నివారం జ‌రిగిన రెండో వ‌న్డేలో న్యూజిలాండ్‌ (New Zealand) పై టీమ్ ఇండియా (India) ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవ‌సం చేసుకున్నది. రాయ్‌పుర్ (Raipur)వేదిక‌గా శ‌నివారం జ‌రిగిన రెండో వ‌న్డేలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. కాగా క్రికెట్‌లో తన సత్తాను చాటుకుంటూ కొన్ని రోజులుగా శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి ODIలో 149 బంతుల్లో 208 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ (Double century) సాధించి.. తక్కువ వయసులో రికార్డు నమోదు చేశాడు. రెండో వన్డేలోనూ 40 పరుగులతో నాటౌట్ (not out)గా నిలిచాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill).. తన బ్యాటింగ్ శైలి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మతో బ్యాటింగ్ (Rohit Sharma )చేస్తూ చాలా నేర్చుకున్నాని చెప్పుకొచ్చాడు.

రోహిత్‌ శర్మ(Rohit Sharma)తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను చాలా నేర్చుకున్నానని గిల్ చెప్పాడు. రాయ్‌పూర్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో ఈ ఆటగాడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం సులభతరంగా మారిందని తెలిపాడు. ‘రోహిత్ భాయ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం ఎప్పుడూ కల. అతనితో పాటు బ్యాటింగ్ నేర్చుకున్నాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను, ఇషాన్ కిషన్(Ishan Kishan) మంచి ఫ్రెండ్స్. బయట కూడా కలిసి చాలా సమయం గడుపుతాం’ అని గిల్ అన్నాడు.

న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత్ విజయం సాధించడంతో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 108 ప‌రుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా(Team India) ఇర‌వై ఓవర్లలోనే (overs)చేధించింది. ఓపెన‌ర్లు రోహిత్ శర్మ, శుభ్ మ‌న్ గిల్ బ్యాట్ ఝులిపించారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఫోర్లు, సిక్సర్లతో చెల‌రేగిపోయాడు. 49 బాల్స్‌లో ఏడు ఫోర్లు (fours), రెండు సిక్సర్ల (sixes) తో 51 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత విరాట్ కోహ్లి(Virat Kohli) 11 ప‌రుగుల‌కే ఔటైనా శుభ్‌మ‌న్ గిల్, ఇషాన్ కిష‌న్ క‌లిసి ఇండియాకు విజ‌యాన్ని అందించారు. శుభ‌మ్‌న్ గిల్ 40 ర‌న్స్‌, ఇషాన్ కిష‌న్ 8 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 ర‌న్స్‌కు ఆలౌటైంది. ష‌మీ, హార్దిక్ పాండ్య, సుంద‌ర్ (Shami, Hardik Pandya, Sundar) బాల్‌తో విజృంభించ‌డంతో న్యూజిలాండ్ వంద ప‌రుగుల్ని క‌ష్టంగా దాటింది. గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) 36 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలుండ‌గానే 2-0 తేడాతో టీమ్ ఇండియా కైవ‌సం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ న్యూజిలాండ్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. పేస్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌ను భార‌త బౌల‌ర్లు చ‌క్కగా వినియోగించుకున్నారు. తొలి ఓవ‌ర్‌లో ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే ఫిన్ అలెన్‌ను పెవిలియ‌న్‌కు (Finn Allen to the pavilion)పంపించాడు ష‌మీ. ఎనిమిద ప‌రుగుల వ‌ద్ద నికోల‌స్ (Nicholas) ఔట‌య్యాడు. ష‌మీ, సిరాజ్ (shami, siraj) చెల‌రేగ‌డంతో 15 ప‌రుగులకే న్యూజిలాండ్ ఐదు వికెట్లను కోల్పోయింది. ఫిలిప్స్‌, బ్రాస్‌వెల్ (Phillips, Braswell)క‌లిసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను చ‌క్కదిద్దే ప్రయ‌త్నం చేశారు. ప్రమాద‌క‌రంగా మారుతోన్న వీరి జోడిని వాషింగ్టన్ సుంద‌న్ విడ‌దీశాడు. ఆ త‌ర్వాత బ్రాస్‌వెల్ 22 ర‌న్స్‌, సాంటార్న్ (santern) 27 ప‌రుగుల‌తో న్యూజిలాండ్ స్కోరును వంద ప‌రుగులు దాటించారు.103 ప‌రుగుల స్కోరు వ‌ద్ద వారిద్దరు వెనుదిర‌గ‌డంతో న్యూజిలాండ్ క‌థ ముగిసింది. టీమ్ ఇండియా బౌల‌ర్లలో ష‌మీ ఆరు ఓవ‌ర్లు వేసి ప‌ద్దెనిమిది ప‌రుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్య (Hardik pandya), వాషింగ్టన్ సుంద‌ర్ త‌లో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌, కుల్దీప్ యాద‌వ్‌ల‌కు ( Siraj, Shardul Thakur and Kuldeep Yadav)లకు ఒక్కో వికెట్ ద‌క్కింది. ఇక జనవరి 24న మూడో మ్యాచ్ జరగనుండగా భారత తుది జట్టులో మార్పులు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.

(Horoscope:ఈ వారం రాశి ఫలాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -