end

DrumStick Leaves: మునగాకుతో ఆరోగ్య ప్రయోజనాలు

మునక్కాయలు(DrumSticks) తిననివారుండరు. ఇది అందరికీ తెలిసు. కానీ మునగాకు(DrumStick Leaves) కూడా వంటలో భాగం చేస్తే ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. మునగాకు ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. బీపీ, షుగర్‌తోపాటు జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. మునగాకు పప్పు కాంబినేషన్‌లో కూర చేసుకొని తింటే చాలా ప్రయోజనాలున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

కీరదోస ఆరోగ్య ప్రయోజనాలు

ప్రయోజనాలు

  • రక్తపోటు నియంత్రణ(BP), కంటి(Eye) సమస్యలు దూరం
  • కాల్షియం, ఐరన్‌ అధికంగా లభిస్తుంది. ఎముకలు గట్టిపడతాయి.
  • మునగాకులో ఉండే బీటాకెరొటిన్‌ కంటిచూపును మెరుగు పరుస్తుంది.
  • మునగాకులోని రసాయనాలు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి. అలాగే రక్తనాళాలాలు గట్టి పడకుండా కాపాడుతుంది.
  • మునగాకులో పీచు పదార్థాలు జీర్ణ సమస్యను దూరం చేస్తుంది. చెడు కొవ్వును తగ్గిస్తుంది.
  • మలబద్దకం, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగం. ఈ మునగాకులో పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
  • ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌ శరీరంలోని చెడు కొవ్వును, మలినాలను బయటకు పంపించి రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను అదుపులో ఉంచుతాయి.
  • మునగాకుల్లో ఉండే విటమిన్‌ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

(Olive Oil: ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని నియంత్రించగలదా?)

Exit mobile version