end
=
Thursday, September 19, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంchia seeds : చియా విత్తనాలు...ఆరోగ్య ర‌హ‌స్యాలు
- Advertisment -

chia seeds : చియా విత్తనాలు…ఆరోగ్య ర‌హ‌స్యాలు

- Advertisment -
- Advertisment -

chia seeds health benefits : చియా విత్తనాలు పండ్లు లేదా కూరగాయలు కావు. ఇవి చూడడానికి చిన్న విత్తనాలు లాగా సబ్జా(Sabja) గింజలా ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా రకాల వ్యాధులను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మీరు ఈ చియా విత్తనాలను శక్తి కలిగి ఉన్న ఒక స్టోర్హౌస్ అని పిలవచ్చు. ఎందుకంటే ఈ విత్తనాల వల్ల చాలా శక్తి లభిస్తుంది. కావున శక్తిని అందించే విత్తనాలలో చియా ప్రధాన భూమిక పోషిస్తుంది.మ‌న శ‌రీరానికి మిక్కిలి పోష‌కాల‌ను(High Protiens) అందించే ఆహారాల్లో చియా విత్తనాలు(chia seeds) కూడా ఒక‌టి. ఇవి అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి.చియా విత్తనాల్లో ఫైబ‌ర్, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మాంగ‌నీస్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్, జింక్, విట‌మిన్ బి3, పొటాషియం, విట‌మిన్ బి1(Vitamin B1), విట‌మిన్ బి2(Vitamin B2) వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శ‌రీరానికి పోష‌ణ‌ను, శ‌క్తిని అందిస్తాయి.

(Belly Fat : డెలివరీ తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకోవాలా ?)

చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి మ‌న శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. చియా విత్తనాల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. తినకుండా ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. ఆక‌లి నియంత్రణ అవుతుంది. దీంతో త‌క్కువ ఆహారం తీసుకుంటారు. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గవ‌చ్చు. చియా సీడ్స్‌లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. మాంసాహారం తిన‌లేని వారికి ఈ విత్తనాల ద్వారా ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. చియా విత్తనాల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రోటీన్లు ల‌భిస్తాయి. చియా విత్తనాల్లో కాల్షియం(Calcium) ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక ఎముక‌లు దృఢంగా ఉంచేలా చేస్తుంది. నిత్యం చియా సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్లడైంది. చియా సీడ్స్‌ను నిత్యం నేరుగా తీసుకోవ‌చ్చు. లేదా వాటి పొడిన జ్యూస్‌లు, స‌లాడ్‌లు(salad), మ‌జ్జిగ(Butter Milk) వంటి ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు.

(Burns : కాలిన గాయాలకు ఇంటి చిట్కాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -