end

Nayanthara: నయనతార, విగ్నేష్ లకి షాక్ ఇచ్చిన సుబ్రహ్మణ్యన్   

నయనతార, విగ్నేష్ శివన్ కొన్ని రోజులు ప్రేమలో  సహజీవనం(coexistence) చేసి ఎట్టకేలకు మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని దంపతులయ్యారు. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి విధానం ద్వారా పిల్లలని పొందారు. నయనతార, విగ్నేష్ శివన్ దంపతులు సరోగసి(Surrogacy) విధానం ద్వారా పిల్లలని పొందరనే వార్త సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తూనే ఉంది. ఈ జంట కవల అబ్బాయిలకు తల్లిదండ్రులు అయ్యారని ప్రకటించారు మరియు చిన్న పిల్లల మొదటి చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా విచారణ చేపడుతోంది. పరిస్థితులు చూస్తుంటే నయన్, విగ్నేష్ జంటకి అనుకూలంగా లేవు.భారతదేశంలో సరోగసి విధానానికి కొన్నినియమ నిబంధనలు ఉన్నాయి.కొంతమంది ఈ విధానన్ని బ్యాన్ చేశారని అంటున్నారు. ఈ విషయం పై తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్ ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతార, విగ్నేష్ నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

(Rowdy Hero: తప్పుల నుంచి నేర్చుకుని విజయాన్ని ఆస్వాదిస్తా…)

ఈ వ్యవహారంపై విచారణ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ(three-member committee) నియమించింది. ఆ కమిటీ విచారణ ప్రారంభించినట్లు సమాచారం. కమిటీ ఆసుపత్రి యాజమాన్యంతో విచారణ ప్రారంభించింది మరియు ప్రాథమిక విచారణ తర్వాత అవసరమైతే విఘ్నేష్ శివన్ మరియు నయనతారలను విచారించాలని అనుకుంటున్నారు ఈ పరిస్థితిలో, నయనతార మరియు విఘ్నేష్ శివన్ పిల్లలకు జన్మనిచ్చిన అద్దె తల్లి దుబాయ్‌లో ఉందని, ఆమెను దుబాయ్‌లో నివసించే నటి సోదరుడు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కాబట్టి, దుబాయ్‌(Dubai)లో సరోగసీపై ఎటువంటి ఆంక్షలు లేనందున, సెలబ్రిటీ జంటపై ఎటువంటి చర్యలు తీసుకోబడవు. కాబట్టి నయన్ కి ఈ వివాదం పెద్ద సమస్య కాకపోవచ్చు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే విచారణలు పూర్తి వివరాలు ఇంకా తెలియనున్నాయి.

Exit mobile version