- బ్లాక్ మార్కెట్‌లో రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.2.12 కోట్లు ఉంటుందని అంచనా. శుక్రవారం రాత్రి పోలీసుల తనిఖీ నిర్వహించగా ఐదు మంది వ్యక్తులు కూరగాయల ట్రక్కులో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గంజాయి కట్టలను సీజ్ చేసి రాజు, పవార్ కర్ణాటకకు చెందిన పప్పుల నగేశ్, గన్నె రవి, మోత్రె ప్రకాశ్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.