హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా సొమ్మును టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని వెస్ట్‌జోన్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఓ కారులో నలుగురు వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో వాహన తనిఖీలు చేసి పట్టుకున్నట్లు హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సింది!
అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్
రూ.3.75 కోట్ల రూపాయాలను సీజ్ చేసి, ఈశ్వర్ దిలీప్ జీ, హరీష్ రామ్ బాయ్, అజిత్ సింగ్, రాథోడ్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. అసలు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి..? ఎవరికి ఈ డబ్బును ఇవ్వడానికి వెళుతున్నారనే వివరాలను ఇంకా రాబట్టాల్సిఉంది. అయితే ఈ హవాలా డబ్బును, నిందితులను ఆదాయపన్నుశాఖకు అప్పగిస్తున్నామని తెలిపారు.