end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంన‌గ‌రంలో భారీ వ‌ర్షం..
- Advertisment -

న‌గ‌రంలో భారీ వ‌ర్షం..

- Advertisment -
- Advertisment -

న‌గ‌రంలో వ‌రుణుడు మ‌రోసారి విజృంభించాడు. జంట‌న‌గ‌రాల్లోని ప‌లు ప్రాంతాల్లో కురిసిన భారీ వ‌ర్షంతో న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. ఎల్బీన‌గ‌ర్‌,నాగోల్,మ‌న్సూరాబాద్‌, వ‌న‌స్థలిపురం, హ‌య‌త్ న‌గ‌ర్‌,తుర్కయాంజాల్‌,పెద్ద అంబ‌ర్‌పేట్‌, అబ్దుల్లాపూర్ మెట్‌, చంపాపేట్‌, సైదాబాద్, స‌రూర్ న‌గ‌ర్‌, చైత‌న్యపురి,మ‌ల‌క్‌పేట‌,దిల్‌సుఖ్ న‌గ‌ర్‌, అంబ‌ర్‌పేట‌, కొత్తపేట‌, క‌ర్మన్ ఘాట్‌, సంతోష్‌న‌గ‌ర్‌,చాద‌ర్ ఘాట్‌, ఓయూక్యాంప‌స్‌,తార్నాక‌,లాలాపేట్‌,హ‌బ్సిగూడ‌,నాచారం,మల్లాపూర్‌లో వర్షం విప‌రీతంగా కురిసింది.

కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్లలో అర గంట నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారులపై నీరు పొంగిపొర్లడంతో పలు చోట్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -