- 16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల
గత రెండు రోజులుగా దక్షిణాది రాష్ర్టాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంకు తోడు ఉపరితల ద్రోణి వల్ల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలావుండగా గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
అధికారులు 16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. వరద కాలువ ద్వారా దిగువ మానేరులోకి కూడా నీటిని వదిలిపెట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 75,794 క్యూసెక్కులు ఉండగా 74,794 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ప్రాజెక్టు నీటి మట్టం ప్రస్తుతం 1,091 అడుగులు ఉంది. దీంత ప్రాజెక్టు పూర్తిగా నిండింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 90.31 టిఎంసిలు ఉడగా ప్రస్తుత నీటి నిల్వ 9031 టిఎంసిలు ఉంది.