end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంమూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !
- Advertisment -

మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !

- Advertisment -
- Advertisment -
  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావం
  • 19, 20, 21 తేదీల్లో భారీ వర్ష సూచన
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

కరోనాతో ఐ.జీ బినోద్‌కుమార్‌ మృతి

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ర్టాలలోని అన్ని ప్రాజెక్టులు, చెరువులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అదేవిధంగా హైదరాబాదులో నగరం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఆదివారం నాడు కాస్త బ్రేక్‌ ఇచ్చిన వర్షాలు … మళ్లీ మరో మూడు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

వినియోగదారులకు పేటిఎం షాక్‌

అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వైధవ్య కోడలిని పెళ్లాడిన మామ…!

అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -