- దేశవ్యాప్తంగా కురుస్తాయంటున్న IMD
IMD rain alert : భారతీయ వాతవరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల్లో దేశ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర (North india) భారతంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని ఐఎండీ (IMD)పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. వాయువ్య భారతంతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బాల్టిస్థాన్, ముజాఫర్‌బాద్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, తూర్పుమధ్య ప్రదేశ్ (Jammu, Kashmir, Ladakh, Gilgit, Baltistan, Muzaffarabad, East Uttar Pradesh, East Madhya Pradesh)తో పాటు తమిళనాడులో మంగళవారం నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది.
ఇక తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయి. హిమాచల్‌ప్రదేశ్, బిహార్‌లలో (In Himachal Pradesh and Bihar)రానున్న 24 గంటలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో మరో 48 గంటల్లో రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంటుంది. అయితే.. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, బిహార్, తూర్పు రాజస్థాన్, (Punjab, Haryana, Chandigarh, Delhi, Uttar Pradesh, West Rajasthan, Bihar, East Rajasthan) వాయువ్య మధ్యప్రదేశ్‌లో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల మధ్యలో ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
(Singer Mangli:రాళ్ల దాడిపై స్పందించిన మంగ్లీ)
పశ్చిమ హిమాలయ ప్రాంతంలో సోమవారం వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. మంగళవారం నుంచి ఈ నెల 26వరకు కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వానలు పడతాయి. 24, 25న జమ్ము, కశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బాల్టిస్థాన్, ముజాఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షపాతం/ హిమపాతం నమోదవుతుంది. 25, 26వ తేదీల్లో ఉత్తరాఖండ్‌లో వర్షాలు పడతాయి. పంజాబ్, హరియాణా, చంఢీగఢ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్(Punjab, Haryana, Chandigarh, Delhi, Uttar Pradesh)లలో సోమవారం మోస్తారు వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ప్రాంతాల్లో 24 నుంచి 26 వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఉత్తర రాజస్థాన్, మధ్యప్రదేశ్(North Rajasthan, Madhya Pradesh)లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి 26 వరకు ఉరుములతో కూడిన వర్షం, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షపాతం నమోదవుతుంది.