తెలంగాణలో గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని రోజుల పాటు రాష్ర్టంలో పలు చోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలుగు రాష్ర్టాల్లో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. కావున లోతట్టు ప్రాంతవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read…
- సెప్టెంబర్ 30న గురుకుల ప్రవేశ పరీక్షలు
- కరోనా వైరస్‌తో మాదాపూర్ ఎస్.ఐ మృతి
- ప్రగతిభవన్ ముందు నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
- మత్తు ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు