end
=
Sunday, June 30, 2024
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో వర్ష భీభత్సం
- Advertisment -

తెలంగాణలో వర్ష భీభత్సం

- Advertisment -
- Advertisment -
  • హైదరాబాద్‌ను ముంచెత్తిన వానలు
  • రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ అధికారులు
  • పొంగిపొర్లుతున్న చెరువులు, వాగులు, ప్రాజెక్టులు
  • పలు చోట్ల విద్యుత్‌ అంతరాయం
  • విరిగిపడుతున్న చెట్లు, విద్యుత్‌ స్తంబాలు

జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలుగు రాష్ర్టాలలో మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్థంభించింది. చాలా చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చల్లటి గాలులు వీస్తుండడంతో చాలా చోట్ల విద్యుత్‌ స్తంబాలు, చెట్లు విరిగిపడ్డాయి. ప్రజలు ఎవరూ ఇండ్ల నుండి బయటకు రావొద్దని అధికారులు, వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహన దారులు, పాదచారులు రోడ్ల మీదకు రాకపోవడమే చాలా మంచిది. ఇక హైదరాబాద్‌ నగరంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

పెద్ద ఉరుములతోపాటు చాలా వేగంతో గాలలు వీస్తుండడంతో నగరం వణికిపోతుంది. ఇప్పుడు రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా విపరీతమైన భారీ గాలులతో కూడిన వర్షం పడుతుంది. రోడ్ల వెంబడి ఉన్న చెట్లు కూలిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో పూర్తి మునిగిపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది రోడ్ల మీద ఉన్న మ్యాన్‌హోల్స్‌ను తెరిచి వర్షపు నీటిని తరలిస్తున్నారు. వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టుల‌కు, చెరువుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి.

అల్వాల్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

హైద‌రాబాద్ శివార్ల‌లోని హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చరించారు. ఈ నేప‌థ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. మూసీ న‌ది పొంగిపొర్లుతోంది. చాద‌ర్‌ఘాట్‌, ముసారాంబాగ్ బ్రిడ్జిల వ‌ద్ద పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న హిమాయ‌త్‌సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది.

Actress Naina Hot Photos…

శివార్లలో కురుస్తున్న భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హిమాయ‌త్‌సాగ‌ర్‌కు వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. హిమాయత్‌సాగ‌ర్‌లో క్రమక్రమంగా నీటిమ‌ట్టం పెరుగుతోంది. ఆ జ‌లాశ‌యం ప్రస్తుత నీటిమ‌ట్టం 1762.176 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటిమ‌ట్టం 1763.50 అడుగులు. 833 క్యూసెక్కుల నీరు హిమాయ‌త్‌సాగ‌ర్‌కు వ‌చ్చి చేరుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -