end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో జోరు వానలు...
- Advertisment -

తెలంగాణలో జోరు వానలు…

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షియర్‌ జోన్‌ ప్రభావం వల్ల శుక్రవారం ఉదయం నుండి వాతావరణం మారిపోయింది. ఆకాశంలో పూర్తిగా నల్లని మేఘాలతో నిండిపోయింది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం సమయానికి వర్షాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలలో, హైదరాబాద్‌లోని బాలానగర్‌, కూకట్‌పల్లి, అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌, సికిందరాబాద్‌, మల్కాజ్‌గిరి, తార్నాక, ఉప్పల్‌ తదితర ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రోడ్లన్నీ వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాలలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఫ్లై ఓవర్‌ల కింద చిక్కుకుపోయారు. జీహెచ్‌ఎంసీ అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అయితే ప్రజలు అవసరమైతే తప్పా ఇంట్లో నుండి బయటకు రావొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపైన ఉండే మ్యాన్‌హోల్స్‌ చాలా ప్రమాదకరం. పొరపాటున పాదాచారులు జారిపడే ప్రమాదం ఉంది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లిన విద్యార్థులు వర్షం తగ్గాకే ఇళ్లకు వెళ్లాలని సూచన.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -