end
=
Saturday, October 5, 2024
వార్తలుజాతీయంNarendramodi :సాధారణంగా ముగిసిన హీరాబెన్‌ అంత్యక్రియలు
- Advertisment -

Narendramodi :సాధారణంగా ముగిసిన హీరాబెన్‌ అంత్యక్రియలు

- Advertisment -
- Advertisment -
  • తల్లి పాడే మోసిన నరేంద్ర మోడీ
  • సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Prime Minister Narendra Modi) మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ (Mother is Heeraben Modi) అంత్యక్రియలు గాంధీనగర్ (Gandhi nagar))శ్మశానవాటికలో ముగిశాయి. అనారోగ్యం కారణంగా ఈ తెల్లవారుజామున మృతి చెందిన ఆమె అంతిమయాత్ర సాధాసీదాగానే నిర్వహించారు. అయితే తన తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న వెంటనే మోడీ అహ్మదాబాద్‌ (Ahmedabad) చేరుకోగా తల్లి హీరాబెన్ పార్థివదేహన్ని యుఎన్‌ మెహతా ఆస్పత్రి (us mehta hospital)నుంచి నేరుగా గాంధీనగర్‌లోని (Gandhinagar) రైసన్ గ్రామంలోని బృందావన్ సొసైటీ (Vrindavan society)లో ఉంటున్న కుమారుడు పంకజ్ మోడీ ఇంటికి తీసుకొచ్చారు. ఢిల్లీ (Delhi)నుంచి అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని నేరుగా సోదరుడు పంకజ్ మోడీ ఇంటికి చేరుకుని తన తల్లికి నివాళులర్పించారు. కుమారులు, ముఖ్యమైన కుటుంబసభ్యులు సందర్శన అనంతరం అంత్యక్రియల కోసం వాహనంలో గాంధీనగర్‌ సెక్టార్ 30లోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు.

ఈ క్రమంలో తల్లి పాడెను మోడీ ఎత్తుకోగా ఆ తర్వాత వాహనంలో పార్థివదేహంతో పాటు శ్మశానవాటికకు చేరుకున్నారు. అయితే ఎలాంటి హడావుడి లేకుండా సాధారణంగా అంతిమయాత్ర నిర్వహించడం విశేషం. కాగా ఆమె అంత్యక్రియలకు తమ కుటుంబ సభ్యులు హాజరుకానుండగా బీజేపీ (BJP) కార్యకర్తలు, అభిమానులు ఎవరూ వారి రాకకు అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి తల్లి హీరాబెన్‌ మృతి పట్ల వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపుతున్నారు.

ఇక భారత ప్రధాని మోడీకి మాతృవియోగం కలగడంతో పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఈ మేరకు హీరాబెన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి (Megastar chiru).. ‘మన గౌరవనీయులైన ప్రధాన మంత్రికి ప్రియమైన తల్లి శ్రీమతి హీరాబెన్ మోడీ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారు. స్వర్గలోకానికి బయలుదేరిన ఆమె దివ్య ఆత్మకు నా నివాళులు. మోడీ గారికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.

(Tamil Nadu:లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకండి)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -