end

సౌత్‌ సినిమాలపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..

టాలీవుడ్ సినిమా ముకుందతో ఎంట్రీ ఇచ్చి, అనంతరం మంచి విజయాలతో స్టార్‌ హీరోలతో నటించి.. స్టార్‌డమ్‌ సంపాదించిన నటి పూజా హెగ్డే సౌత్‌ ఇండియన్‌ సినిమాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కూర్చున్న కొమ్మను తానే న‌రుక్కోవ‌డమంటే ఇదేనేమో కాబోలు. త‌న‌ను స్టార్ హీరోయిన్‌గా నిల‌బెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమపై పూజా హెగ్డే సంచ‌లన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సౌత్ ఇండియ‌న్ సినిమా వాళ్లు న‌డుము మ‌త్తులోనే ఉంటార‌ని, మిడ్ డ్రెస్‌ల‌లో హీరోయిన్‌లను చూడాల‌నుకుంటార‌ని చెప్పుకొచ్చారు. ఆమె న‌వ్వుతూ చెప్పిన ఈ కామెంట్లు సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. సౌత్ ఇండియా సినిమాల వ‌ల్లే హీరోయిన్‌గా రాణిస్తూ డ‌బ్బులు సంపాదిస్తున్న పూజా ఇలాంటి కామెంట్లు చేయ‌డం దారుణ‌మ‌ని తిట్టిపోస్తున్నారు. అన్నం పెట్టిన చేతికి సున్నం పెడుతోంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇలా ద‌క్షిణాదిని కించ‌ప‌రిచే బ‌దులు గ్లామ‌ర్ పాత్రలు చేయ‌కుండా ఉండాల్సింద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

అంత సాంప్రదాయమైన పడుచైతే బాలీవుడ్‌లో గ్లామరస్‌ పాత్రలు చేయట్లేదా..! తెలుగులో కాస్త పేరు రాగానే హృతిక్సి నిమా ఆఫర్‌ అందుకుంది. అది కాస్తా బాక్సాఫీస్‌ వద్ద బొల్తా పడే సరికి మళ్లీ తెలుగు చిత్రసీమను వెతుక్కుంటూ వచ్చిందని అభిమానులు తెగ ఫైర్‌ అవుతున్నారు. తెలుగు చిత్రాల‌ను వ‌దిలేసి హిందీలో సెటిల్ కావాల్సింద‌ని ఉచిత స‌ల‌హా ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ చేసినందుకు త‌గిన గుణ‌పాఠం చెప్పావ‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీని వ‌దిలి వెళ్లిపోమ‌ని ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

Exit mobile version