end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంనలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్
- Advertisment -

నలుగురు హీరోయిన్ల ఫోన్లు సీజ్

- Advertisment -
- Advertisment -

వెబ్‌డెస్కు : బాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేసింది ఎన్సీబీ నలుగురు హీరోయిన్లను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కేసులో ఇప్పటికే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ను ప్రశ్నించిన ఎన్సీబీ, నిన్న మరో ముగ్గురు హీరోయిన్లు, దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌లను వేర్వేరుగా విచారించింది. ఈ సందర్భంగా వారిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి

తాజాగా ఈ డ్రగ్స్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఈ నలుగురి హీరోయిన్ల ఫోన్లను ఎన్సీబీ అధికారులు సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే ఈ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ముంబాయి బీటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు 19మందిని అదుపులోకి తీసుకున్నామని తాజాగా నలుగురు హీరోయిన్ల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు వెల్లడించారు అధికారులు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -