end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంHidden treasures:ప్రతాపరుద్రుడి కోటపై గుప్తనిధులు..
- Advertisment -

Hidden treasures:ప్రతాపరుద్రుడి కోటపై గుప్తనిధులు..

- Advertisment -
- Advertisment -

  • కోటలో వేట కొనసాగిస్తున్న ముఠాలు
  • జేసీబీలతో పెద్ద ఎత్తున్న తవ్వకాలు 
  • నేలమట్టమౌతున్న చారిత్రాత్మక కట్టడాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ ( Mahaboobnagar) నేటి నాగర్ కర్నూల్ (Nagar kurnool)జిల్లా నల్లమల అటవీ (Nallamala forest)ప్రాంతం ప్రకృతికి, శివాలయాలకు (shiva)నిలయం. కాకతీయుల (kakatiya) కాలం నాటి రుద్రమదేవి (Rudrama devi)మనువడు  ప్రతాపరుద్రుడు (prataparudra)అమ్రాబాద్ (Arabad mandal) మండలం మన్ననూరు (Manna noor)గ్రామ సమీపంలో ఎత్తైన కొండపై కోట (FORT) నిర్మించుకున్నాడు. ఈ కోటపై గుప్త నిధుల (Hidden funds) ముఠా కన్నుపడింది. ఈ ప్రాంతంలో శివాలయంలో గుప్త నిధుల ముఠా గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అటవీ, పోలీసు (Police)అధికారులు నిఘా ఏర్పాటు చేసినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రతాపరుద్రుని కోటపై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ ముఠాను అటవీశాఖ (Forest department)అధికారులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అటవీ, పోలీసు అధికారులు ప్రకృతికి నిలయమైన, చారిత్రాత్మకమైన  ప్రతాపరుద్రుని కోటను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఈ కోటలో పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉన్నాయన్న నమ్మకంతో తెలుగు రాష్ట్రాలకు (telugu states) చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులు సైతం పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి తరలివచ్చి తవ్వకాలు  జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆ ముఠాల బృందం కొంతమంది స్థానికులతోనూ పరిచయాలను ఏర్పాటు చేసుకొని  వారిని ముఠా సభ్యులుగా చేర్చుకొని తవ్వకాలకు పాల్పడుతున్నట్లు పలు సందర్భాలలో వెలుగు చూసింది.

(Planet Killer:‘ప్లానెట్ కిల్లర్’తో భూమికి ప్రమాదమే..)

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు శత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా కోటలను నిర్మించుకున్నారు అని కథనం. ఈ సందర్భంగా కోటలో విలువైన ఆభరణాలను , నాణాలను (Jewellery, coins) దాచి ఉంచారని ముఠా సభ్యులు భావిస్తారు. ఈ కోట విశాలంగా ఉండడం, పలు శివాలయాలు ఇక్కడే ఉండడంతో తప్పనిసరిగా గుప్తనిధులు ఉంటాయని ముఠా సభ్యులు, మంత్రగాళ్ల నమ్మకం.  ఈ క్రమంలో లెక్కలేనన్నిసార్లు తవ్వకాలకు గురైన ఈ ప్రాంతం ఈ ఏడాది కాలంలోనే ఐదారుసార్లు (5 times)తవ్వకాలు జరపడం వెనక  పెద్ద ఎత్తున కొన్ని ముఠాలు ఉన్నాయని తెలుస్తోంది. జనవాసానికి దూరంగా ఉండటంతో జెసిబిలు (JCB) పెట్టి  తవ్వకాలు జరుపుతుండడం విశేషం.

ప్రతాపరుద్రుని (Prataparudra Fort)కోట పరిసర ప్రాంగణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. వారి వద్ద మంత్రాలు తంత్రాలకు సంబంధించిన సామాగ్రి ఉండడం, తదితర కారణాలతో అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి చెందిన రామచంద్రయ్య (Rama chandraiah), జక్కా రామాంజనేయులు (Ramanjaneyulu), మల్లేపల్లి (mallappally)ప్రాంతానికి చెందిన కరువని కృష్ణయ్య (Krishnaiah), భూత్పూర్ (Bhoothpur) మండలానికి చెందిన చంద్రమౌళి (chandramouli)అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. కాకతీయ చక్రవర్తుల వైభవానికి ప్రతీకగా నిలిచే నిర్మాణాల్లో ఒకటైన ప్రతాపరుద్ధరిని కోటను కాపాడడానికి ప్రభుత్వం (government)చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. గుప్తనిధుల తవ్వకాలు చేసే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ప్రాంత పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

(Pawan Kalyan:పవన్ కళ్యాణ్‌ను చంపేస్తారా..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -