అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పట్లో స్టే ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు తేల్చి చెప్పింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ఫిబ్రవరిలో జరపతలపెట్టిన స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలసిందే.