- పది గేట్లు ఎత్తివేసి దిగువ కృష్ణానదికి వరద జలాలు
- ఇన్‌ఫ్లో 4,01,818 క్యూసెక్‌లు
- అవుట్‌ఫ్లో 4,96,497 క్యూసెక్‌లు
దసరా పండుగకు TSRTC ప్రత్యేక బస్సులు
భారీగా కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు పది గేట్లు ఎత్తివేసి నీటిని దిగువ కృష్ణానది నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 883.80 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4,01,818 క్యూసెక్కు ఉండగా, అవుట్ ఫ్లో 4,96,497గా ఉంది. అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు.. ప్రస్తుతం నీటి నిల్వ 208.72 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో పుష్కలంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
రానున్న మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న దృష్ట్యా ప్రాజెక్టుకు ఇంకా పెద్ద వరద కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ప్రాజెక్టును వీక్షించేందుకు వచ్చే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా శ్రీశైలం రోడ్డులోని ఘాట్ కొండచరియలు విరిగిపడిపోతున్నాయని, పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్లమీదకి దొర్లుతున్నాయని, కావున వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.