end

ధవళేశ్వరం బ్యారేజీకి భారీ వరదనీరు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పడుతున్న భారీ వర్షాలకు గోదావరి నిండుగా పొర్లుతుంది. మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి వదులుతూనే ఉన్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదైంది.

గోదావరి వరద నీటిని సుమారు పది లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తూర్పు డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులు, మధ్యమ డెల్టాకు మూడు వేల క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలావుంటే భద్రాచలం వద్ద 45.10 అడుగుల నీటిమట్టం నమోదు అయ్యింది. గోదావరి ఎగువ ప్రాంతంలోని కాలేశ్వరం వద్ద 9.17 మీటర్లు, పేరూరు వద్ద 11.70, దుమ్ముగూడెం వద్ద 12.52, భద్రాచలం వద్ద 45.10 అడుగులు, కూనవరం వద్ద 18.30 మీటర్లు, కుంట వద్ద 12.94 మీటర్లు, కొయిదా వద్ద 23.15మీటర్లు, పోలవరం వద్ద 12.94, రాజమహేంద్రవరం రైల్వే హేక్ బ్రిడ్జి వద్ద 16.23 మీటర్ల తో వరద గోదావరి ప్రవహిస్తోంది.

(శ్రీశైలం ఘాట్‌ రోడ్డుపై కూలిన రక్షణ గోడ)

Exit mobile version