end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఆంధ్రప్రదేశ్‌లో ఆగని విగ్రహాల విధ్వంసం
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌లో ఆగని విగ్రహాల విధ్వంసం

- Advertisment -
- Advertisment -
  • విజయవాడలో మరో ఘటన
  • రామాలయంపై దాడి, సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దుండగులు దాడులు ఇంకా ఆగడం లేదు. ప్రతీ రోజు ఏదో ఒక హిందూ దేవాలయాలలోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. రోజు రోజుకు ఈ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. పోలీసులకు, అధికారులకు నిద్రపట్టనివ్వడం లేదు. అసలు ఎవరు ఈ పనిచేస్తున్నారో కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఇదిలావుండగా విజయవాడలో మరో విగ్రహ ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. పండిట్‌ నెహ్రు బస్‌స్టేషన్‌కు సమీపంలోని సీతారామ దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. తాళం వేసి ఉన్న గుడిలోని సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరీశీలించారు. విగ్రహం ఎలా ధ్వంసం అయిందోనని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -