న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి బ్రిటీషర్లతో పోరాడిన మహానేతల్లో ఒకరు లాలా లజపతిరాయ్. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోరాటం ఎన్నటికీ మరచిపోలేదన్నాడు. ఆయన సేవలు చిరస్మరణీయం అని ప్రధాని పేర్కొన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి ఎందరికో ప్రేరణ కలిగించిందని ప్రధాని వెల్లడించారు. కాగా, లాలా లజపతిరాయ్ 1865 జనవరి 28న జన్మించారు.