end

Durga Navratri :పవిత్రమైన నవరాత్రులు

Durga Navratri : నవరాత్రులలో దుర్గాదేవి(Goddess Durga) స్వయంగా ఇంటికి వస్తుందని అందరూ నమ్ముతారు. ఏ పని చేసినా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిన్నటి నుంచి భారతీయులకు(Indians) పవిత్రమైన నవరాత్రులు మొదలయ్యాయి. అశ్వినీ మాస నవరాత్రిని శరన్నవరాత్రులు (Sharannavaratrulu) అని భారతీయులు పిలుస్తారు. అయితే ఈ తొమ్మది రోజులు భక్తులకు చాలా పవిత్రమైనవని.. ఎంతో భక్తితో ఉంటారు. ఈ తొమ్మిది రోజుల్లో 8 రోజుల చాలా అరుదైనవని శాస్త్రం చెబుతోంది.ఈ పండుగ చెడుపై మంచి సాదించింది అని శుభసూచిక. ఇది పితృ పక్షం ముగింపుతో మొదలయే తొమ్మిది రోజుల(Navratri) పండుగ. ఈ తొమ్మిది రోజుల పండుగలో దుర్గా దేవిని(durga matha worship) పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్(Swastik Symbol) ఉంటే శుభప్రదమని నమ్ముతారు. ఇది అదృష్టం, శ్రేయస్సు తెస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు స్వస్తిక్ చేయడానికి పసుపు, బియ్యం ఉపయోగింస్తారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం(Happiness), ఐశ్వర్యం, ధాన్యం పెరుగుతాయి అని నమ్మకం. ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకులను వేలాడదీయడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి రాకుండా ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు . కాబట్టి నవరాత్రులలో, మీరు కొన్ని మామిడి ఆకులను తెచ్చి, వేలాడదీయడం మంచిది. ఇంట్లో తులసి మొక్క(Basil Plant)కు చాలా ప్రాముఖ్యత ఉంది. నవరాత్రులలో ఇంట్లో తులసిని నాటడానికి సరైన సమయం.      

     

శరన్నవరాత్రుల శుభ యోగాలు:

శుక్ల యోగం:
25 సెప్టెంబర్ 2022, ఉదయం 09.06 నిమిషాల నుంచి 26 సెప్టెంబర్ 2022 ఉదయం 08.06 నిమిషాల వరకు
బ్రహ్మ యోగం
26 సెప్టెంబర్ 2022, ఉదయం 08.06 నుంచి 27 సెప్టెంబర్ 2022, 06.44 ఉదయం వరకు
బ్రహ్మచారిణి:
బ్రహ్మ యోగం:
26 సెప్టెంబర్ 2022, ఉదయం 08.06 నుంచి 27 సెప్టెంబర్ 2022, 06.44 ఉదయం వరకు
ఇంద్ర యోగం:
27 సెప్టెంబర్ 2022, 06.44 ఉదయం నుంచి 28 సెప్టెంబర్ 2022, 05.04 ఉదయం వరకు
ద్విపుష్కర యోగా:
27 సెప్టెంబర్ 2022, 06:17 ఉదయం నుంచి 28 సెప్టెంబర్ 2022, రాత్రి 02:28 వరకు
29 సెప్టెంబర్ 2022 – కూష్మాండ:
రవి యోగం:

29 సెప్టెంబర్ 2022, 05:52 ఉదయం నుంచి 30 సెప్టెంబర్ 2022, 05.13 ఉదయం వరకు
30 సెప్టెంబర్ 2022 స్కందమాత:
సర్వార్థ సిద్ధి యోగం:

30 సెప్టెంబర్ 2022 ఉదయం 05.13 నుంచి 01 అక్టోబర్ 2022, 04.10 ఉదయం వరకు
ప్రీతి యోగా:
12.56 ఉదయం నుంచి 10.33 మధ్యాహ్నం (30 సెప్టెంబర్ 2022)
01 అక్టోబర్ 2022 కాత్యాయని:
రవి యోగం:

04.19 ఉదయం నుంచి 06.19 ఉదయం వరకు
ఆయుష్మాన్ యోగా:
30 సెప్టెంబర్ 2022, 10.33 రాత్రి నుంచి 01 అక్టోబర్ 2022, 07.59 ఉదయం వరకు
02 అక్టోబర్ 2022 – కాలరాత్రి:
సౌభాగ్య యోగం:

01 అక్టోబర్ 2022, 07.59 రాత్రి నుంచి 02 అక్టోబర్ 2022 సాయంత్రం 05.14 గంటల వరకు
సర్వార్థ సిద్ధి యోగం:
02 అక్టోబర్ 2022, ఉదయం 06.20 నుంచి 03 అక్టోబర్ 2022, రాతి 01.53 వరకు
03 అక్టోబర్ 2022 మహాగౌరి:
శుభ యోగం:

02 అక్టోబర్ 2022, 05.14 సాయంత్రం – 03 అక్టోబర్ 2022, 02.22 రాత్రి వరకు
04 అక్టోబర్ 2022 – సిద్ధిదాత్రి:
రవియోగం:

రోజంతా
05 అక్టోబర్ 2022 – చివరి రోజు:
రవియోగం:
ఉదయం 06.21 నుంచి రాత్రి 09.15 వరకు

(దసరా వేడుకలకు ముస్తాబవుతున్న ఇంద్రకీలాద్రి)

Exit mobile version