end
=
Sunday, January 19, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంBurns : కాలిన గాయాలకు ఇంటి చిట్కాలు
- Advertisment -

Burns : కాలిన గాయాలకు ఇంటి చిట్కాలు

- Advertisment -
- Advertisment -

Home Tips for Burns : ఏదో ఒక సందర్భంలో వంటగది(Kitchen) లో ఎంత జాగ్రత్తగా ఉన్నా చేతులు కాల్చుకోవడం సహజంగా చూస్తుంటాము. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనమీద అనుకోకుండా ఆయిల్ చిల్లడం, వేడిగా ఉన్న కుక్కర్ అనుకోకుండా ముట్టుకోవడం వల్ల చర్మంపై (Skin Burning) కాలుతూ ఉంటాయి. కాలిన గాయలు నాలుగు రకాలు, ఫస్ట్ లేయర్ స్కిన్ బర్న్, సెకండ్ లేయర్ స్కిన్ బర్న్, థర్డ్ లేయర్ స్కిన్ బర్న్, ఫోర్త్ లేయర్ స్కిన్ బర్న్. ఈ నాలుగు రకాలు, మొదటి రెండు రకాలను ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. చివరి రెండు రకాలకు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. మొదటి రెండు రకాల కాలిన గాయాలు, బొబ్బలు, మచ్చలు నివారించడానికి హోం రెమిడీస్(Home Remedies) చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి, గాయాలు మానే వరకూ హోం రెమెడీస్ ను వాడుతూనే ఉండాలి. కాలిన వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. చల్లటి నీటిలో క్లాత్ ముంచి, నీటిని పిండేసి కాలిన చర్మంపై కొన్ని గంటలపాటు క్లాతును ఉంచాలి.

(Knee Pains:మోకాళ్ల నొప్పుల తో బాదపడుతున్నారా…)

కాలిన గాయాలకు మన అమ్మలు, అమ్మమ్మలు ఉపయోగించే మొదటి రెమెడీ పసుపు(Turmeric Powder). కాలిన వెంటనే మొదట గాయాన్ని నీళ్ళతో కడిగి, తేమ తుడిచి, తర్వాత పసుపు రాయాలి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్(Anti Axidents) కాలిన గాయాలను వెంటనే నయం చేస్తుంది. వాపుని, మచ్చలు తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగులో చిటికెడు పసుపు కలిపి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటినీటితో(Cold Water) శుభ్రం చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయాలి. కాలిన గాయలాకు ఐస్ బాగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఐస్ ను నేరుగా గాయాల మీద రుద్దకూడదు. ఐస్ ప్యాక్ (Ice Pack) ను అప్లై చేయాలి.స్కిన్ బర్న్ ను నివారించడంలో చాలా సింపుల్ మార్గం ల్యావెండర్ ఆయిల్ (Lavender Oil). కాలినగాయాల మీద రెండు మూడు చుక్కల నూనె వేసి అప్లై చేయాలి. ఇలా క్రమంగా రోజూ చేస్తుంటే కాలిన గాయాల నుండి ఉపశమనం కలుగుతుంది.

(Garlic : వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…)

రోజుకు ఐదు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.కాలిన వెంటనే గాయం మీద టూత్ పేస్ట్ ను రాయకూడదు. మొదట కాలిన గాయాన్ని నీటితో కడిగే , తర్వాత టిష్యుపేపర్ లేదా పొడి బట్టతో గాయాన్ని తుడవాలి.దీని వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఆ తర్వాత టూత్ పేస్ట్ ను అప్లై చేయాలి. దీన్ని అప్లై చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలిగుతుంది. అయితే టూత్ పేస్ట్ లో వివిధ రకాలు ఉంటాయి. అయితే వాటిలో పుదీనా ఫ్లేవర్ కలిగిన వైట్ కలర్ టూత్ పేస్ట్ ను గాయాల మీద రాయడం మంచిది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -