బదిలీపేరుతో రియల్ వ్యాపారి నమ్మక ద్రోహం
Dark Circle : కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖాన్ని అందవిహీనం చేస్తాయి. సాదారణంగా ఈ వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా (Sleepless) లేకపోవడం, మానసిక ఒత్తిడి(mental stress), పోషకాహార లోపం, పొల్యూషన్, చర్మం చాలా మృదువుగా ఉండడం లాంటివి కారణాలు. అయితే ఈ నల్లటి వలయాలను ఇంటి చిట్కాలతో ఎలా నయం చేసుకోవాలో చూద్దాం…
దోసకాయ..
దోసకాయ(Cucumber) ముక్కల్ని గుండ్రంగా కత్తిరించుకుని వాటిని కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి, ఆ తర్వాత కళ్లపై ఉంచుకోవాలి. అలా కాకున్నా దోసకాయ ముక్కలని చిదిమేసి, ఆ రసాన్ని వలయాల మీద మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత పూర్తిగా శుభ్రంగా కడిగేసుకోవాలి.
యాలకులతో శృంగార సమస్యలకు చెక్
బంగాళ దుంప..
బంగాళ దుంపలని(Potato) కొద్ది సేపు రిఫ్రిజిరేటర్లో ఉంచుకుని తర్వాత వాటిని ముక్కలుగా కత్తిరించుకుని, దాన్ని రసంగా చేసి, ఆ రసాన్ని కళ్లకింద వలయాల చుట్టూ మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా ఓ వారం రోజుల పాటు చేస్తే సరైన ఫలితం దక్కుతుంది.
రోజ్ వాటర్..
రోజ్ వాటర్(Rose Water) చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కళ్లకింద వలయాలని పోగొట్టడంలో రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. ఒక చిన్న కాటన్ ముక్క తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి, కళ్ళకింద వలయాల భాగంలో మర్దన చేసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజూ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తే సరిపోతుంది.