
మేషం (Aries) : శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. ఇతరులు మిమ్మల్ని చూసి అపోహపడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.

వృషభం (Taurus): శత్రువుల కూడా మిత్రులుగా మారతారు. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో జాగ్రత్తగా వ్యగవహరించండి. గత కొంత కాలంగా కుటుంబములోని వివాదాలు తొలగిపోతాయి.

మిథునం(Gemini) : గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ సంతానం పై చదువుల విషయమై బాగా శ్రమిస్తారు. మీ ధైర్యసాహసాలకు, కార్యదీక్షకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వస్త్ర, బంగారు, వెండి రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బదిలీలు మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

కర్కాటకం (Cancer):రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఖర్చులు బాగా పెరిగే అస్కారం ఉంది. వస్త్ర, స్టేషనరీ, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు పోయే ఆస్కారం ఉంది. స్త్రీలకు షాపింగ్‌ను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ప్రధానం.

సింహం (Leo) : వాహనచోదకులకు ఊహించని ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు ఒత్తిళ్ళు, మొహమాటాలకు పోవటం వల్ల ఇబ్బందులెదుర్కోక తప్పదు.ఒకయత్నం ఫలించటంతో మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పురోభివృద్ధి.

కన్య (Virgo) : జాయింట్ వ్యాపారాలు, ఉమ్మడి వ్యవహరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలున్నాయి. రాబోయే ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెంచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి.

తుల (Libra) : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. విద్యార్థులకు ప్రేమ విషయాల్లో భంగపాటు తప్పదు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు సంపాదన, ఉద్యోగం పట్ల ఆసక్తి ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

వృశ్చికం (Scorpio) : రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ఎల్.ఐ.సి, బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్ల ధనం అందుకుంటారు. రాజకీయ నాయకులకు ప్రజాదరణ అధికంగా ఉంటుంది.

ధనస్సు (Sagittarius): ఏసీ, కూలర్ మోకానిక్ రంగాలలో వారిక సంతృప్తి కానవస్తుంది. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలుచేస్తారు. ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలలోని వారికి యాజమాన్యం నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. మీ సృజనాత్మక శక్తికి, తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది.

మకరం (Capricorn): వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. భార్య, భర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి అవమానాలను పొందినా మంచి గుర్తింపు లభిస్తుంది.చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.

కుంభం(Aquarius) : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. సోదరుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. స్త్రీలు విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. వైద్య, ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి.

మీనం(Pisces) : నూతన వాతావరణం, పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించటం మంచిదికాదు. స్త్రీలకు షాపింగులోను, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దూరప్రయాణాలు, తీర్థయాత్రలలో అసౌకర్యానికి గురవుతారు.