ఉదయాన్నే అలారం (Alarm)మోగడానికి కొన్ని నిమిషాల (minutes) ముందు ఒక కన్ను మూసుకుని ఫోన్ (Phone)లేదా పడక గడియారాన్ని (Watch) తనిఖీ చేయడమనేది చాలామందిలో కనిపించే వింత (habit)అలవాటు. అంటే నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరాలు (body) టైమ్‌తో (Time)పాటు మేల్కొనే సమయాన్ని పసిగట్టగలవు. వింతగా ఉన్నప్పటికీ, ఈ అలవాటు మీ మిగిలిన నిద్ర (sleep) సమయం గురించి మీకు హెచ్చరిక ఇవ్వడం ద్వారా అలారం ఉద్దేశ్యాన్ని ఓడిస్తుంది. అయితే అలారానికి కొద్ది నిమిషాల ముందు నిద్ర ఎందుకు చెదిరిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
ఇలా సమయానికి ముందే మేల్కొనడానికి శాస్త్రీయ కారణం ఉందని (There is a scientific reason) నిపుణులు చెబుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, మన శరీరం సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ లేదా న్యూక్లియై (Suprachiasmatic nucleus or nuclei) ‘SCN’ అని పిలువబడే నరాల (మెదడులో ఒక చిన్న ప్రాంతమైన హైపోథాలమస్) (Hypothalamus)చే నియంత్రించబడుతుంది. ఇది సర్కాడియన్ రిథమ్స్ (Circadian rhythms)నియంత్రించేందుకు బాధ్యత వహిస్తుంది. సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్.. రక్తపోటు (Blood pressure), శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అలాగే మన సమయా భావంపైనా ఒక ట్యాబ్‌ను (Tab) ఉంచుతుంది. పగటిపూట (Afternoon)నిద్ర ఆవహిస్తుంటే, మెలకువగా ఉంచేందుకు సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్ పిలుపును అందుకుంటుంది. అలాగే భోజనం (Lunch)చేసిన తర్వాత హఠాత్తుగా చిన్న కునుకు తీయాలనిపిస్తే వాలిపోయే కళ్లకు కూడా ఈ నాడీయే కారణం.
(Head Bath:తలస్నానంతో మహిళలకు ప్రమాదమే!)
SCN మన నిద్ర మేల్కొలుపును ప్రేరేపిస్తుంది, నిద్ర-మేల్కొనే చక్రం PER అనే ప్రోటీన్ (protein)ద్వారా నియంత్రించబడుతుంది. మనం ప్రతి రాత్రి (Night)ఒకే సమయానికి పడుకోవడం, మరుసటి రోజు ఉదయం (Morning)అదే సమయానికి మేల్కొనే రొటీన్ హ్యాబిట్ అనుసరించడం వలన ఈ సైకిల్ మరింత సమర్థవంతంగా, ఏకరీతిగా మారుతుంది. PER ప్రోటీన్ స్థాయి రోజులో పెరుగుతుంది, పడిపోతుంది. దీని తక్కువ స్థాయిలు తక్కువ రక్తపోటుకు దారితీసి రాత్రిపూట నిద్రపోయేలా చేస్తాయి. అదేవిధంగా అధిక పీడనం వల్ల మనకు బాగా మేల్కొని ఉన్నట్లు అనిపిస్తుంది.18 ఏళ్లు పైబడిన వారు రాత్రికి 7-8 గంటలు (7 hours) నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచి స్లీప్ షెడ్యూల్ (Sleep schedule)కు కట్టుబడి ఉంటే, అలారం మోగే ముందే వారి శరీరం PER స్థాయిలను స్వీకరించడం, పెంచడం నేర్చుకుంటుంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే, అలారం కంటే ముందు మేల్కొనే అలవాటు స్థిరమైన నిద్ర షెడ్యూల్ ఉన్నవారిలో ఎక్కువగా జరుగుతుంది. సాధారణంగా అలారం మోగడానికి గంట ముందు నిద్రలేవడం జరుగుతుందని నిపుణులు పేర్కొన్నారు.