end
=
Saturday, February 22, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంKiss : ముద్దు పెడితే ఎన్ని లాభాలో..
- Advertisment -

Kiss : ముద్దు పెడితే ఎన్ని లాభాలో..

- Advertisment -
- Advertisment -

Kiss : ముద్దు అనేది ఓ భావ వ్యక్తీకరణ. ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేయడంలో ముద్దు కూడా ఒకటి. మాట్లాడకుండానే ఒక్క ముద్దు ద్వారా ఎదుటివారిపై ఉన్న అభిమానానాన్ని చెప్పొచ్చు. అందుకే ముద్దు గురించి ఎన్నో కవితలు, కవిత్వాలు, పాటలు, మాటలు ఇలా వస్తూనే ఉంటాయి. ఈ పేరుతో సినిమాలు కూడా వచ్చి హిట్ కొట్టినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ముద్దు గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం ముద్దు ముద్దుగా..

(Curry leaf: ‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!)

ముద్దు అనేది నిజంగా అంత కిక్ ఇస్తుందా అది మనల్ని మనం అడగాల్సిందే ఎవరైనా మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేసినా ముద్దు పెట్టినా ఆ అనుభూతి మర్చిపోగలమా అంత త్వరగా ముద్దు అనేది కేవలం లవర్స్, కపుల్స్ మధ్య ఉండేదే కాదండోయ్ ప్రేమ, అభిమానం ఉండే అన్ని బంధాల మధ్య కూడా ముద్దు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే మన దగ్గర ఇప్పుడిప్పుడే కాస్తా విస్తరిస్తున్నప్పటికీ ముద్దుతో పలకరించే సాంప్రదాయం విదేశాల్లో ఎప్పట్నుంచో ఉండనే ఉంది. అందుకే ముద్దుని బెస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అంటారు. చిన్నపిల్లల్ని ప్రేమతో పెట్టే ముద్దు , అలిగినప్పుడు ముద్దు పెట్టి బతిమాలితే బుజ్జగింపు, యవ్వనంలో ప్రేమని తెలియజేసే ప్రేమ ముద్దు, అబ్బో ఒక్కటేవిటి.. ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి.

(Fenugreek: మెంతులతో ఎన్నో ప్రయోజనాలు)

ముద్దులు కేవలం అనుభూతి మాత్రమే కాదండోయ్ దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎవరైనా దగ్గరికి తీసుకుని ముద్దు పెడితే క్షణాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. ఇలా రెగ్యులర్‌గా ముద్దులు పెట్టుకునే జంటలు ఎప్పటికీ ఆనందంగా మిగతా వారితో పోల్చితే అనోన్యంగా ఉంటారట. రోజువారీ జీవితంలో కిస్‌ కీ రోల్ పోషిస్తుంది. ప్రేమను వ్యక్తపరిచే అతి ముఖ్యమైన ఎక్స్‌ప్రెషన్‌ అయిన కిస్‌ని అస్సలు మర్చిపోకూడదు మరి. కాబట్టి ఏంచక్కా మీరు ముద్దుల్లో మునిగి తేలండి. హాయిగా ఇంట్లోని బంధాలతో ఆయా సందర్భానికి ప్రేమ, ఆప్యాయతతో ముద్దులిచ్చి కృతజ్ఞతలు చెప్పండి.నిద్రపోయే ముందు బుగ్గపై ముద్దుపెట్టి నిద్రపుచ్చండి. పనికోసం బయటికి వెళ్లేప్పుడు, లేదా వెళ్ళొచ్చాక చాలా మిస్ అయిన మీ ప్రేమికులకి ముద్దుని అందించండి. ఏదైనా బాగా పనిచేసినప్పుడు కాంప్లిమెంటరీగా కిస్ కానిచ్చేయండి. ఇలా అవసరం ఉన్నప్పుడల్లా ముద్దు పెట్టి మీ ప్రేమని గెలిపించుకోవాలి అది కేవలం ప్రేమికులకి మాత్రమే కాదు అన్నీ బందాలకి ముద్దు తో మన ప్రేమ ని తెలియపరచాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -