end

Diabetes:రక్తంలో షుగర్ లెవల్స్‌ని సహజంగా తగ్గించడం ఎలా???

మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాది. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. ఇందులో రక్తంలో చక్కెర స్థాయి పెరిగి శరీర అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఇన్సులిన్(Insulin) తగినంతగా ఉత్పత్తి కాకపోవడమే మధుమేహానికి ముఖ్యమైన కారణం. మన వంటగదిలో లభించే అనేక పదార్థాలతో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. అయితే, మనం వాటిని సరైన సమయంలో, సరైన మార్గంలో తీసుకోవడం ఎలా తెల్సుకుందాం.

మెంతులు :  రుచికి చేదుగా ఉంటుంది.తినడానికి ఎక్కువ ఇష్టపడరు కానీ ఇవి తినడం వల్ల ఊబకాయం(Heavy weight), కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని  తగ్గిస్తుంది. గ్లూకోస్ టాలరెన్స్‌ను పెంచుతుంది.

(మెంతులతో ఎన్నో ప్రయోజనాలు)

దాల్చిన చెక్క :  దాల్చిన చెక్క(Cinnamon) అద్భుతమైన లాభాలను అందిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.కాబట్టి . భోజనం చేసే ముందు కొంచం దాల్చిన చెక్క తినండి.  ఇది భాగ పెరుకపోయిన కొవ్వును కరిగించడానికి, కొలెస్ట్రాల్(Cholesterol) తగ్గించడానికి సహాయపడుతుంది.

అల్లం : అల్లం(Ginger) మనం సాధారణంగా కూరల్లో వాడుతాం కానీ ఇది మధుమేహానికి కూడా ఉపయోగపడుతుంది.కానీ డాక్టర్ ని అడిగి ఎంత మోతాదులో వాడలో తెల్సుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. అల్లంలో యాంటీ డయాబెటిక్, హైపోలిపిడెమిక్, యాంటీ ఆక్సిడేటివ్ లక్షణాలు చాలా ఉంటాయి. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. HbA1Cతో పాటు షుగర్ లెవల్స్‌(Sugar levels)ని తగ్గించడం లో సహాయం చేస్తుంది.

బ్లాక్ పెప్పర్ : ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ(Insulin Sensitivity)ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితి కి తేవడానికి దోహదపడుతుంది. మీ శరీరక శక్తిని మెరుగుపరుస్తుంది.

చేపలు: మధుమేహం తో బాడపడేవారు చేపలు(Fish) తింటే చాలా మంచిది. చేపల్లో హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారంలో కేవలం రెండు సార్లు అయిన చేపలను తింటే మంచిది.

ఓట్స్: ఎక్కువ ఫైబర్(Fiber) ఉండే వాటిలో ఓట్స్ కూడా ఒకటి.శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చెక్కర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్ ఓట్స్ లో పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎక్కువ ఆకలి కాకుండా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

బాదం: సాయాత్ర సమయం లో ఏదో ఒకటి తినాలి అనుకునే వారు కొన్ని బాదం(Almonds) పప్పులని తింటే సరిపోతుంది. త్వరగా శక్తి ని  ఇస్తుంది ఆకలి కాకుండా చేస్తుంది.

(అల్లంతో ఎన్ని ప్రయోజనాలో.)

Exit mobile version