end
=
Monday, January 20, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంరక్తహీనత సమస్యను తగ్గించడం ఎలా?….
- Advertisment -

రక్తహీనత సమస్యను తగ్గించడం ఎలా?….

- Advertisment -
- Advertisment -

ఎండుద్రాక్షలు రక్తహీనత సమస్యను తగ్గించడంతో పాటుగా.. శరీరాన్ని కూడా ఆరోగ్యం గా ఉంచుతాయి. దీన్ని ఎలా ఉపయోగించాలంటే..!

ఎండుద్రాక్షల్లో ఉండే పోషకాలు శరీరానికి అనేక వ్యాధులతో పోరాడే శక్తిని అందించి వ్యాధినిరోధక శక్తి ని పెంచుతాయి. ఎండు ద్రాక్షలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎండు ద్రాక్షలో క్యాలరీలు చాలా అధికంగా ఉంటాయి. కనుక మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎండు ద్రాక్ష మంచి హెల్తీ ప్రోటీన్ గా కూడా పనిచేస్తుంది. ఎండు ద్రాక్షలను తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలో రక్తానికి ఏ లోటూ ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండుద్రాక్షల్లో మరియు తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాదు ఎన్నో రకాల రోగాలు దూరమవుతాయి. జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యల నుంచి బయట పడటానికి ఇవి దివ్య ఔషదంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉపయోగించడం ఎలా:

ఎండుద్రాక్షల్లో, తేనె లో కాల్షియం, ఐరన్ తో పాటుగా ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని అలాగే తినేయకుండా రాత్రంగా ఒక గ్లాస్ నీటిలో 8 నుంచి 9 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరకడుపున ద్రాక్షలను తేనెతో కలిపి తినేయాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -